పాత,కొత్త సమ్మేళనం
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:38 AM
చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కమిటీని పార్టీ అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది. ఇదివరకే అధ్యక్షుడిగా షణ్ముగ రెడ్డి (పుత్తూరు)ని, ప్రధాన కార్యదర్శిగా వై.సునీల్ కుమార్ చౌదరి (తవణంపల్లె)ని ప్రకటించిన విషయం తెలిసిందే.
-చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీకి కొత్త కమిటీ
చిత్తూరు సిటీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కమిటీని పార్టీ అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది. ఇదివరకే అధ్యక్షుడిగా షణ్ముగ రెడ్డి (పుత్తూరు)ని, ప్రధాన కార్యదర్శిగా వై.సునీల్ కుమార్ చౌదరి (తవణంపల్లె)ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్షులుగా డి.దశరథ వాసు (నిండ్ర), సి.రామచంద్ర నాయుడు (వి.కోట),ఆర్.నరసింహులు నాయుడు (ఐరాల),యం.రవియాదవ్ (కార్వేటి నగరం), కె.మైఖేల్ (చిత్తూరు), ఆర్.రమణారెడ్డి (చంద్రగిరి), నాగభూషణం రెడ్డి (శాంతిపురం), మంజులమ్మ (పలమనేరు), డి.ధనంజయులు నాయుడు (వడమాల పేట), కార్యనిర్వహక కార్యదర్శులుగా యస్.అక్తర్‌బాషా (చిత్తూరు), సుజాత (నగరి), యస్. సుబ్రమణ్యం రెడ్డి (పలమనేరు), వేణుగోపాల్ (పూతలపట్టు), బి.అమ్ములు (చంద్రగిరి), నారాయణ (కుప్పం), టి.పూర్ణిమ (గంగాధరనెల్లూరు), కె.చెంగల్రాయ రెడ్డి (వెదురుకుప్పం), ఎ.మునార్ సాహెబ్ (చంద్రగిరి), అధికార ప్రతినిధులుగా మునిభాస్కర రాజు (విజయపురం), టి.హిమగిరి (యాదమరి), టి.మురళీమోహన్ (కార్వేటినగరం), బత్తిగౌడు (పలమనేరు), శశికర్ బాబు (చిత్తూరు), ఎం.వెంకటేష్ బాబు (పాకాల), పి.సి.సాంబశివం (కుప్పం), బి.ఆర్.యుగంధర్ (పుత్తూరు), పులిచెర్ల మహేష్ (చంద్రగిరి), కార్యదర్శులుగా పి.రవి (బంగారుపాళ్యం), సి.పరంధామ యాదవ్ (చంద్రగిరి), పద్మమ్మ (గుడుపల్లె), టి.మంజు భారతి (వడమాలపేట), కె.ధరణి ప్రకాష్ (యాదమరి), వి.జయలక్ష్మి (కుప్పం), యం.నాగిని (పెనుమూరు), యస్.పర్వీన్ (పలమనేరు), సి.విశ్వనాధ్ (వి.కోట), ట్రెజరర్ పి.చిన్నస్వామి (గంగాధరనెల్లూరు), కార్యాలయ కార్యదర్శిగా యన్.మోహన్‌రాజ్(చిత్తూరు రూరల్), మీడియా కో ఆర్డినేటర్ కె.ఉదయకుమార్ (చిత్తూరు), సోషల్ మీడియా కో ఆర్డినేటర్ లత బాబునాయుడు (ఐరాల) లను నియమించారు.