Share News

అద్భుత దర్శనం లభించింది

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:42 AM

ప్రముఖ నటి విద్యాబాలన్‌ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి కుటుంబసభ్యులతో కలసి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు.

అద్భుత దర్శనం లభించింది

తిరుమల, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):ప్రముఖ నటి విద్యాబాలన్‌ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి కుటుంబసభ్యులతో కలసి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకున్న విద్యాబాలన్‌ను వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయం ముందుకు వచ్చిన విద్యాబాలన్‌ ఓం నమో వేంకటేశాయా అంటూ మీడియాతో మాట్లాడారు. ‘అద్భుతమైన స్వామి దర్శనం లభించింది. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం సంతోషాన్ని కలిగించింది. దన్యవాదాలు’ అన్నారు. అయితే సినిమాల గురించి ఆలయం ముందు మాట్లాడేందుకు విద్యాబాలన్‌ నిరాకరించారు.

Updated Date - Jun 22 , 2025 | 01:42 AM