Share News

రాజ్యాంగానికి పెనుముప్పు!

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:23 AM

బీజేపీ పాలనలో భారత రాజ్యాంగానికి పెనుముప్పు వాటిల్లిందని ఎస్సీ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, కార్యదర్శి యమలా సుదర్శన్‌ విమర్శించారు. ఎస్సీ మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దాకా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను తలపెట్టారు. ఆదివారం కుప్పంలో ఈ యాత్రను కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. వెంటనే ఎస్సీ వర్గీకరణను ఆపాలని డిమాండు చేశారు. పెరిగిన ఎస్సీల జనాభాకు అనుగుణంగా దళితులకు 20శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు. అంతకుముందు చింతామోహన్‌ మాట్లాడుతూ.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ దళితులందరూ కన్నీటితో ఉన్నారన్నారు. ఈ పాదయాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మాల ఉద్యోగుల సంఘం నాయకులు అన్నవరపు కిశోర్‌, చెన్నకేశవులు, కులాయప్ప, మహానంద, వెంకట్‌, దుగ్గాని జయరాం, ప్రకాశ్‌, తాళ్లపాక దాము తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగానికి పెనుముప్పు!
పాదయాత్రను ప్రారంభిస్తున్న కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌

  • ఎస్సీ మాల ఉద్యోగుల సంఘ నాయకుల విమర్శ

  • కుప్పం నుంచి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ప్రారంభం

కుప్పం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): బీజేపీ పాలనలో భారత రాజ్యాంగానికి పెనుముప్పు వాటిల్లిందని ఎస్సీ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, కార్యదర్శి యమలా సుదర్శన్‌ విమర్శించారు. ఎస్సీ మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దాకా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను తలపెట్టారు. ఆదివారం కుప్పంలో ఈ యాత్రను కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. వెంటనే ఎస్సీ వర్గీకరణను ఆపాలని డిమాండు చేశారు. పెరిగిన ఎస్సీల జనాభాకు అనుగుణంగా దళితులకు 20శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు. అంతకుముందు చింతామోహన్‌ మాట్లాడుతూ.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ దళితులందరూ కన్నీటితో ఉన్నారన్నారు. ఈ పాదయాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మాల ఉద్యోగుల సంఘం నాయకులు అన్నవరపు కిశోర్‌, చెన్నకేశవులు, కులాయప్ప, మహానంద, వెంకట్‌, దుగ్గాని జయరాం, ప్రకాశ్‌, తాళ్లపాక దాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 01:23 AM