Share News

గ్రామీణ రహదారులకు మహర్దశ

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:18 AM

గత వైసీపీ హయాంలో కనీస నిర్వహణ లేకపోవడంతో రోడ్లన్నీ ఛిద్రమైపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారుల మరమ్మతులు, నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

గ్రామీణ రహదారులకు మహర్దశ
పెనుమూరు మండలంలో దెబ్బతిన్న అడవిపల్లె రోడ్డు

చిత్తూరు సిటీ, ఆంధ్రజ్యోతి: గత వైసీపీ హయాంలో కనీస నిర్వహణ లేకపోవడంతో రోడ్లన్నీ ఛిద్రమైపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారుల మరమ్మతులు, నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే జిల్లాలోని రహదారుల అభివృద్ధి, మరమ్మతులకు రూ.222 కోట్లను కేటాయించి పనులు చేసింది. తాజాగా మరో రూ.20 కోట్లతో జిల్లాలో 21 రోడ్ల మరమ్మతులను చేపట్టనుంది.

పంచాయతీరాజ్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో రోడ్లను పరిశీలించి అందించిన నివేదిక ఆధారంగా పనుల్ని మంజూరు చేశారు. ఇప్పటికే ఈ పనులకు సంబంధించిన టెండర్లు పూర్తవ్వగా, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

కుప్పానికి అత్యధికంగా రూ.8.63 కోట్లు

జిల్లాకు మంజూరైన రూ.20కోట్లలో సింహభాగం సీఎం సొంత నియోజకవర్గం కుప్పానికి కేటాయించారు. ఇక్కడి నాలుగు మండలాలకు ఏకంగా రూ.8.63 కోట్లు మంజూరయ్యాయి. ఫ కుప్పం వేపనపల్లె రోడ్డు నుంచి మటార్లపల్లె వరకు రూ.40లక్షలు. కుప్పం పచ్చూరు రోడ్డు నుంచి వసనాడు వయా తాళ్లచెరువు కొట్టాలు, ములకపల్లె వరకు రూ.1.20 కోట్లు, కుప్పం పచ్చూరు రోడ్డు నుంచి వసనాడు రోడ్డు వయా ముంకలదొడ్డి వరకు రూ.1.30 కోట్లు ఫ రామకుప్పం రోడ్డు నుంచి గొరివిమాకులపల్లె వరకు రూ.40 లక్షలు, గొరివిమాకులపల్లె నుంచి పెద్దబండారు వయా దేశినాయనపల్లె వరకు రూ.1.20 కోట్లు ఫ శాంతిపురం మండలంలో దండికుప్పం రోడ్డు నుంచి కదిరిముత్తనపల్లె వయా నల్లరాళ్లపల్లె వరకు రూ.45 లక్షలు, రాళ్లబూదుగూరు రోడ్డు నుంచి శివకురుబూరు వయా కొత్తపేట వరకు రూ.1.54 కోట్లు ఫ గుడుపల్లె మండలంలో కేపీ రోడ్డు నుంచి నలగాంపల్లె వరకు రూ.35 లక్షలు, టి.అగ్రహారం రోడ్డు నుంచి పెద్దకోటమాకనపల్లె వరకు రూ.36 లక్షలు, పొగురుపల్లె రోడ్డు నుంచి కర్ణాటక బోర్డర్‌ వయా కె.గొల్లపల్లె వరకు రూ.50 లక్షలు, కుప్పం - కేజీఎఫ్‌ రోడ్డు నుంచి చింతరపాళ్యం వయా పొగురుపల్లె వరకు రూ.53 లక్షలు మంజూరు చేశారు.

జీడీనెల్లూరుకు రూ.3.44 కోట్లు

పెనుమూరు మండలంలో అడవిపల్లె రోడ్డు వయా తూపల్లె వరకు రూ.56 లక్షలు. వెదురుకుప్పం మండలంలో తిరుపతి -కొత్తపల్లెమిట్ట రోడ్డు నుంచి కేపీపీ రోడ్డు వయా అగ్గిచేనుపల్లె హెచ్‌డబ్ల్యూ వరకు రూ.2.88 కోట్లు మంజూరయ్యాయి.

పూతలపట్టుకు రూ.3 కోట్లు

తవణంపల్లె మండలంలో గాజులపల్లె సరకల్లు రోడ్డు నుంచి ముచ్చుకాలువ వరకు రూ.60 లక్షలు. ఐరాల మండలంలో చిత్తూరు- ఐరాల నుంచి 45 కొత్తపల్లె, అడపగుండ్లపల్లె వరకు రూ.80 లక్షలు. బంగారుపాళ్యం మండలంలో ఎంసీబీ రోడ్డు నుంచి చంద్రశేఖరపురం వయా బోడబండ్ల వరకు రూ.1.60 కోట్లు మంజూరయ్యాయి.

చిత్తూరుకు రూ.3.20 కోట్లు

గుడిపాల మండలంలో ఎన్‌హెచ్‌4 నుంచి నరహరిపేట వయా సీకే పల్లె బసవాపల్లె వరకు రూ.1.20 కోట్లు. పెద్దపంజాణి మండలంలో కేసీ రోడ్డు నుంచి నగిరేపల్లె వరకు రూ.2 కోట్లు ఫ పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం ఏబీటీ రోడ్డు నుంచి ఉయ్యాలమిట్ట వయా కురునిపల్లె వరకు రూ.70లక్షలు మంజూరయ్యాయి.

Updated Date - Jul 28 , 2025 | 01:18 AM