Share News

ఎన్టీయార్‌ రాజుకు ఘన నివాళి

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:22 AM

ఎన్టీఆర్‌ రాజు మృతదేహాన్ని బుధవారమే తిరుమలలో ఆర్బీ సెంటర్‌లోని సొంతింటికి తీసుకొచ్చారు. పలువురు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు గురువారం తిరుమలకు చేరుకుని నివాళులర్పించారు. నివాళులు అర్పించినవారిలో.. ఎమ్మెల్యేలు మురళీమోహన్‌, అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఏపీ జీబీసీ చైర్‌పర్సన్‌ సుగుణమ్మ, పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, మాజీ జేఈవో శ్రీనివాసరాజు, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, యాదవ కార్పోరేషన్‌ చైర్మన్‌ నరసింహయాదవ్‌, తిరుపతి కార్పోరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, నేతలు గౌనివారి శ్రీనివాసులు, ఊకా విజయ్‌కుమార్‌, పులిగోరు మురళి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. ఆయన మృతదేహంపై టీడీపీ జెండా కప్పారు. సాయంత్రం వైకుంఠరథం వాహనం ద్వారా బాలాజీనగర్‌లోని శ్మశానానికి ఎన్టీఆర్‌ రాజు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.

ఎన్టీయార్‌ రాజుకు ఘన నివాళి

తిరుమల, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ రాజు మృతదేహాన్ని బుధవారమే తిరుమలలో ఆర్బీ సెంటర్‌లోని సొంతింటికి తీసుకొచ్చారు. పలువురు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు గురువారం తిరుమలకు చేరుకుని నివాళులర్పించారు. నివాళులు అర్పించినవారిలో.. ఎమ్మెల్యేలు మురళీమోహన్‌, అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఏపీ జీబీసీ చైర్‌పర్సన్‌ సుగుణమ్మ, పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, మాజీ జేఈవో శ్రీనివాసరాజు, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, యాదవ కార్పోరేషన్‌ చైర్మన్‌ నరసింహయాదవ్‌, తిరుపతి కార్పోరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, నేతలు గౌనివారి శ్రీనివాసులు, ఊకా విజయ్‌కుమార్‌, పులిగోరు మురళి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. ఆయన మృతదేహంపై టీడీపీ జెండా కప్పారు. సాయంత్రం వైకుంఠరథం వాహనం ద్వారా బాలాజీనగర్‌లోని శ్మశానానికి ఎన్టీఆర్‌ రాజు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.

పెదనాన్న వెళ్లిపోయారు: మోహన్‌రూప

ఈసందర్భంగా నందమూరి మోహన్‌కృష్ణ కుమార్తె మోహన్‌ రూప మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్‌ రాజు విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. మా కుటుంబానికి సంతోషం, దుఖం ఏదివచ్చినా ఎన్టీఆర్‌ రాజు పెదనాన్న వచ్చి నేను ఉన్నానని నిలబడేవారు. మమ్మల్ని చూసేందుకు ఏడాదిలో రెండుమూడు సార్లు వచ్చేవారు. ఈ అనుబంధం నేటికీ కొనసాగుతోంది. ఇది ఆ దేవుడు ఇచ్చిన బంధం. ఈ బంధం ఎప్పటికీ ఇలానే కొనసాగాని కోరుకుంటున్నా. కొండంత ధైర్యం ఎన్టీఆర్‌ రాజు కుమారులైన మా అన్నలకు ఇవ్వాలని కోరుకుంటున్నా. మా పెదనాన్న ఎన్టీఆర్‌ రాజు ఆత్మకు శాంతి కలగాని కోరుకుంటున్నాం’ అని అన్నారు. ఎన్టీఆర్‌ రాజు మృలా ఎన్టీ రామారావు అభిమానులకు తీరని లోటని నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నామన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 03:22 AM