మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించిన అటవీ అధికారి డిస్మిస్
ABN , Publish Date - Jun 04 , 2025 | 02:02 AM
తన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించిన అటవీశాఖ అధికారిని ప్రభుత్వం డిస్మిస్ చేసిన ఉదంతమిది. దొరవారిసత్రం మండలం నేలపట్టు బర్డ్ శాంక్చువరీలో ఫారెస్టు రేంజి అధికారిగా పనిచేస్తూ 2023లో కింది స్థాయి మహిళా ఉద్యోగి పట్ల అనుచితంగా వ్యవహరించిన బి.వరప్రసాద్ తాజాగా ఉద్యోగం నుంచీ ఉద్వాసనకు గురయ్యారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కాగా కోర్టు ఇటీవల జైలు శిక్ష విధించిన నేపధ్యంలో డిస్మిస్ వేటు వేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా వున్నాయి. సూళ్ళూరుపేట వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్ డివిజన్ పరిధిలోని నేలపట్టు బర్డ్ శాంక్చువరీలో ఇదివరకూ బి.వరప్రసాద్ ఫారెస్టు రేంజి అధికారిగా పనిచేశారు. ఆ సమయంలో 2023 జూన్ 9న ఉదయం కార్యాలయంలో పనిచేసే ఫారెస్టు బీట్ అధికారి షేక్ అర్షత్తున్నీసాను లైంగికంగా వేధించారు. దీనిపై బాధితురాలు దొరవారిసత్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. సూళ్ళూరుపేట జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు విచారణ జరిగింది.
- నేరం రుజువై జైలు శిక్ష పడిన పర్యవసానం
తిరుపతి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించిన అటవీశాఖ అధికారిని ప్రభుత్వం డిస్మిస్ చేసిన ఉదంతమిది. దొరవారిసత్రం మండలం నేలపట్టు బర్డ్ శాంక్చువరీలో ఫారెస్టు రేంజి అధికారిగా పనిచేస్తూ 2023లో కింది స్థాయి మహిళా ఉద్యోగి పట్ల అనుచితంగా వ్యవహరించిన బి.వరప్రసాద్ తాజాగా ఉద్యోగం నుంచీ ఉద్వాసనకు గురయ్యారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కాగా కోర్టు ఇటీవల జైలు శిక్ష విధించిన నేపధ్యంలో డిస్మిస్ వేటు వేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా వున్నాయి. సూళ్ళూరుపేట వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్ డివిజన్ పరిధిలోని నేలపట్టు బర్డ్ శాంక్చువరీలో ఇదివరకూ బి.వరప్రసాద్ ఫారెస్టు రేంజి అధికారిగా పనిచేశారు. ఆ సమయంలో 2023 జూన్ 9న ఉదయం కార్యాలయంలో పనిచేసే ఫారెస్టు బీట్ అధికారి షేక్ అర్షత్తున్నీసాను లైంగికంగా వేధించారు. దీనిపై బాధితురాలు దొరవారిసత్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. సూళ్ళూరుపేట జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు విచారణ జరిగింది. విచారణలో అటవీ రేంజి అధికారి బి.వరప్రసాద్ నేరం రుజువు కావడంతో కోర్టు మూడు నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 వేలు జరిమానా విధిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 9న తీర్పు ప్రకటించింది. కోర్టు జైలు శిక్ష విధించిన నేపధ్యంలో ప్రస్తుతం ప్రకాశం జిల్లా మార్కాపురంలో అటవీ రేంజి అధికారిగా కొనసాగుతున్న వరప్రసాద్‌ను ఉద్యోగం నుంచీ డిస్మిస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసాధారణ గెజిట్ నోటిషికేషన్ జారీ చేసింది.