Share News

ట్రాక్టర్‌తో వరిపంటను దున్నేసిన అన్నదాత

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:52 AM

ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంట భారీవర్షాలకు పూర్తిగా దెబ్బతినడంతో ఓ రైతు పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు.

ట్రాక్టర్‌తో వరిపంటను దున్నేసిన అన్నదాత
ట్రాక్టర్‌తో వరిపంటను దున్నేసిన అన్నదాత

యాదమరి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంట భారీవర్షాలకు పూర్తిగా దెబ్బతినడంతో ఓ రైతు పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. యాదమరి మండలం పెరుమాళ్ళపల్లెకు చెందిన రాజశేఖర రెడ్డి 2.30 ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు చేశాడు. పంట చేతికొచ్చే దశలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు పొలాలన్నీ నీట మునిగిపోయాయి. రోజుల తరబడి పొలంలో నీరు నిలిచిపోవడంతో వరి పూర్తిగా కుళ్ళిపోయి, కోలుకోలేని విధంగా నష్టం వాటిల్లింది. దీంతో పంటను పొలంలో ఉంచినా ప్రయోజనం లేదని భావించిన రాజశేఖర రెడ్డి తీవ్ర మనోవేదనతో శనివారం తన వరిపంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు.ప్రభుత్వం స్పందించి నష్టపోయిన ఇలాంటి రైతులకు పరిహారం అందించి ఆదుకోవాల్సివుంది.

Updated Date - Nov 09 , 2025 | 12:52 AM