పనిచేయని సర్వర్
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:27 AM
రిజిస్ట్రేషన్‌శాఖకు సంబంధించి మెయిన్ సర్వర్ వారం రోజులుగా సరిగ్గా పనిచేయడం లేదు. ఈ కారణంగా చిత్తూరు ఆర్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు సరిగ్గా జరగక కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

- ఇబ్బందుల్లో కక్షిదారులు
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్‌శాఖకు సంబంధించి మెయిన్ సర్వర్ వారం రోజులుగా సరిగ్గా పనిచేయడం లేదు. ఈ కారణంగా చిత్తూరు ఆర్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు సరిగ్గా జరగక కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన క్రయవిక్రయదారులు కార్యాలయం దగ్గర గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరైతే రిజిస్ట్రేషన్లు చేసుకోకుండానే వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.
నేడు కూడా రిజిస్ట్రేషన్లు
రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ శనివారం సెలవురోజైనా పనిచేస్తుందని జిల్లా రిజిస్ట్రార్ వెంకటరమణమూర్తి తెలిపారు. చిత్తూరు ఆర్వో కార్యాలయంతోపాటు మిగిలిన ఏడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తాయని పేర్కొన్నారు. కక్షిదారులు రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌లు చేసుకోవచ్చని సూచించారు.