Share News

అక్రమాల ‘గుట్టు’ తేలింది.....

ABN , Publish Date - Sep 10 , 2025 | 02:24 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో పలువురు అధికారులు, సిబ్బందిపై త్వరలోనే క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఐదేళ్ళ వైసీపీ పాలనలో డీసీసీబీలో ఆర్థిక విధ్వంసం, కోట్లాది రూపాయిల అవినీతి తదితర అంశాలను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.పాలకవర్గం, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, రుణాల మంజూరులో వైసీపీ శ్రేణులకే పెద్దపీట వేయడం, కమీషన్లకు తెరతీయడం,ఉద్యోగ నియామకాల్లోనూ అవకతవకలకు పాల్పడడం తదితరాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఆర్వో మోహన్‌కుమార్‌ విచారణ జరిపి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.విచారణలో ఈ అంశాలన్నీ నిజమేనని తేలినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ఆ రిపోర్టును కలెక్టర్‌ గతవారం డీసీవో లక్ష్మీకి అందిస్తూ అక్రమార్కులపై తదుపరి చర్యలకు సిఫార్సుచేశారు. డీసీసీబీ చైర్మన్‌ అమాస రాజశేఖర రెడ్డి అధ్యక్షతన త్వరలో జరగనున్న సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దోషులుగా తేలిన అప్పటి వైసీపీ నాయకులు, బ్యాంకు చైర్‌పర్సన్‌ రెడ్డెమ్మతో పాటు సెవెన్‌మెన్‌ కమిటీ సభ్యులందరి ఆస్తుల జప్తుకు చర్యలు తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు అప్పటి వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తి బ్యాంకు ఆస్తులను, నిధులను పప్పుబెల్లాల్లా అందించిన 20మందికి పైగా బ్యాంకు అధికారులు, సిబ్బందిపై ఇంక్రిమెంట్‌ కట్‌ వంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నారు. వీరిలో కొందరిపై వేటు పడే అవకాశం కూడా ఉంది. ఐదేళ్ళు బ్యాంకు చైర్‌పర్సన్‌గా రెడ్డమ్మ వున్నప్పటికీ వైసీపీ నేత అయిన ఆమె భర్త కృష్ణమూర్తి సమావేశాల్లో కూర్చోవడం, అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగేది.బ్యాంకు అధికారులతో కొందరు డైరెక్టర్లు కుమ్మక్కై రుణాలకు సంబంధించిన ప్రతి ఫైల్‌కు 10శాతం వసూలు చేసి మంజూరు చేసేవారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి అండదండలతో పాలకవర్గ సభ్యులు వారి బంధువుల పేర్లతో రికార్డుల్లో లేకుండా రూ.10 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు.

అక్రమాల ‘గుట్టు’ తేలింది.....
డీసీసీబీ ప్రధాన కార్యాలయం

ఇక వేటు ఖాయమే!

  • కలెక్టర్‌ నుంచి డీసీవోకు అందిన డీసీసీబీ నివేదిక

  • అక్రమార్కుల ఆస్తుల జప్తుకోసం డీఆర్వో సిఫార్సు

  • బ్యాంకు అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు

  • త్వరలో జరిగే పాలకవర్గ సమావేశంలో నిర్ణయం

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో పలువురు అధికారులు, సిబ్బందిపై త్వరలోనే క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఐదేళ్ళ వైసీపీ పాలనలో డీసీసీబీలో ఆర్థిక విధ్వంసం, కోట్లాది రూపాయిల అవినీతి తదితర అంశాలను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.పాలకవర్గం, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, రుణాల మంజూరులో వైసీపీ శ్రేణులకే పెద్దపీట వేయడం, కమీషన్లకు తెరతీయడం,ఉద్యోగ నియామకాల్లోనూ అవకతవకలకు పాల్పడడం తదితరాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఆర్వో మోహన్‌కుమార్‌ విచారణ జరిపి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.విచారణలో ఈ అంశాలన్నీ నిజమేనని తేలినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ఆ రిపోర్టును కలెక్టర్‌ గతవారం డీసీవో లక్ష్మీకి అందిస్తూ అక్రమార్కులపై తదుపరి చర్యలకు సిఫార్సుచేశారు. డీసీసీబీ చైర్మన్‌ అమాస రాజశేఖర రెడ్డి అధ్యక్షతన త్వరలో జరగనున్న సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దోషులుగా తేలిన అప్పటి వైసీపీ నాయకులు, బ్యాంకు చైర్‌పర్సన్‌ రెడ్డెమ్మతో పాటు సెవెన్‌మెన్‌ కమిటీ సభ్యులందరి ఆస్తుల జప్తుకు చర్యలు తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు అప్పటి వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తి బ్యాంకు ఆస్తులను, నిధులను పప్పుబెల్లాల్లా అందించిన 20మందికి పైగా బ్యాంకు అధికారులు, సిబ్బందిపై ఇంక్రిమెంట్‌ కట్‌ వంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నారు. వీరిలో కొందరిపై వేటు పడే అవకాశం కూడా ఉంది. ఐదేళ్ళు బ్యాంకు చైర్‌పర్సన్‌గా రెడ్డమ్మ వున్నప్పటికీ వైసీపీ నేత అయిన ఆమె భర్త కృష్ణమూర్తి సమావేశాల్లో కూర్చోవడం, అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగేది.బ్యాంకు అధికారులతో కొందరు డైరెక్టర్లు కుమ్మక్కై రుణాలకు సంబంధించిన ప్రతి ఫైల్‌కు 10శాతం వసూలు చేసి మంజూరు చేసేవారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి అండదండలతో పాలకవర్గ సభ్యులు వారి బంధువుల పేర్లతో రికార్డుల్లో లేకుండా రూ.10 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. ఒక్క పైసా కూడా ఎవ్వరూ చెల్లించలేదు. 2022లో జరిగిన బ్యాంకు ఉద్యోగుల నియామకాల్లోనూ అక్రమాలు జరిగాయి. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల మేర వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ మొత్తాన్ని అధికారులు, పాలకవర్గం 50-25-25 శాతాల మధ్య పంచుకున్నారు. డబ్బులిచ్చి ఉద్యోగాలు పొందని సిబ్బంది పాలకవర్గ సభ్యుల చుట్టూ తిరిగినా పైసా కూడా వెనక్కి రాలేదు. టెర్మినేట్‌, సస్పెండ్‌ అయిన ఉద్యోగుల నుంచి కూడా భారీ మొత్తాలు తీసుకొని ఉద్యోగాలిచ్చినట్లు ఇటీవల జరిగిన విచారణలో తేలింది. అటెండర్‌, వాచ్‌మెన్‌ నియామకాల్లో గోల్‌మాల్‌, ఓటీఎస్‌, అమూల్‌ రుణాల పేరిట అక్రమార్జన అంశాలపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తలపై విచారణ అధికారి సమగ్ర విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. త్వరలో జరిగే బ్యాంకు బోర్డు సమావేశంలో ఆస్తుల జప్తు, ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు, ఇంక్రిమెంట్‌ కట్‌ వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

9పీటీపీ ఐఆర్‌ఎల్‌14, 17

సూర్యప్రభపై శివపుత్రుడు

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాణిపాక ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో మంగళవారం రాత్రి వరసిద్ధి వినాయకస్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.రాజమ్మ,రాజశేఖర నాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమారులు ఇంద్రసేన నాయుడు, లక్ష్మీపతినాయుడు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారికి ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించాక భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తీసుకురావడంతో ఆలయ కల్యాణ వేదిక వద్ద ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను సూర్య ప్రభ వాహనంపై ఉంచి కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు.కాగా వినాయక స్వామికి మహానందీశ్వరాలయ అధికారులు పట్టువస్త్రాలను సమర్పించారు.ఈవో పెంచలకిషోర్‌, ఏఈవోలు రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి,వాసు ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు,చిట్టిబాబు, ఉభయదారులు పాల్గొన్నారు.ప్రత్యేక ఉత్సవాల్లో బుధవారం చంద్రప్రభ వాహన సేవను నిర్వహించనున్నారు.

చిత్తూరులో నేడు 5కే మారథాన్‌

చిత్తూరు క్రీడలు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి జిల్లా ఎయిడ్స్‌ నివారణ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు 5కే మారథాన్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు టీబీ, ఎయిడ్స్‌ నివారణ అధికారి వెంకటప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు మెసానికల్‌ మైదానం వద్ద రన్‌లో పాల్గొనే విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. 17-25 ఏళ్లలోపు విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. ఉదయం 7.30 గంటలకు రన్‌ను ప్రారంభించి.. పీవీకేఎన్‌ గ్రౌండ్‌ వరకు వెళ్లి తిరిగి మెసానికల్‌ మైదానం వద్దకు చేరుకోవాలన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన మహిళ, పురుషులకు రూ.10వేలు, రెండో స్థానంలో నిలిచినవారికి రూ.7వేలను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక్కడ గెలుపొందినవారు విజయవాడలో జరిగే మెగా మారథాన్‌లో పాల్గొంటారని చెప్పారు.

Updated Date - Sep 10 , 2025 | 02:24 AM