Share News

కంటైనర్‌ను ఢీకొన్న కారు

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:26 AM

ఆగి ఉన్న కంటైనర్‌ను ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

 కంటైనర్‌ను ఢీకొన్న కారు
ధ్వంసమైన కారు

తవణంపల్లె, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆగి ఉన్న కంటైనర్‌ను ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎస్‌ఐ చిరంజీవి తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులోని ఎలాక్ర్టానిక్‌ సిటీకి చెందిన శ్రీకాంత్‌(34) తన తల్లి లక్ష్మీదేవి(55), కుమారుడు శ్రీయాన్‌(3)తో కలిసి తిరుమలేశుడిని దర్శించుకుని కారులో మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రానికి తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై తవణంపల్లె మండలంలోని తెల్లగుండ్లపల్లె సమీపాన ఉన్న నయారా పెట్రోల్‌ బంక్‌ వద్ద పార్కింగ్‌లో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులోని శ్రీకాంత్‌, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడ్డ శ్రీయాన్‌ చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Aug 06 , 2025 | 01:26 AM