యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:36 AM
ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ శ్రీధర్ నాయుడు తెలిపిన వివరాల మేరకు.. యాదమరి మండలంలోని 155 కమ్మపల్లె పరిఽధిలోని గుట్టకింద ఊరు రఘునాథరెడ్డి పొలాన్ని బోదగుట్టపల్లె పంచాయతీ తొట్టిగాని ఇండ్లు గ్రామానికి చెందిన సదాశివం కుమారుడు విజయకుమార్ (26) కుటుంబం కౌలుకు తీసుకుని సాగు చేస్తోంది.
యాదమరి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ శ్రీధర్ నాయుడు తెలిపిన వివరాల మేరకు.. యాదమరి మండలంలోని 155 కమ్మపల్లె పరిఽధిలోని గుట్టకింద ఊరు రఘునాథరెడ్డి పొలాన్ని బోదగుట్టపల్లె పంచాయతీ తొట్టిగాని ఇండ్లు గ్రామానికి చెందిన సదాశివం కుమారుడు విజయకుమార్ (26) కుటుంబం కౌలుకు తీసుకుని సాగు చేస్తోంది. తొట్టిగాని ఇండ్లులోని బంధువుల ఇంట్లో ఆదివారం సాయంత్రం భోజనం చేసి కౌలుకు తీసుకున్న పొలం వద్దకు విజయకుమార్ వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో.. సోమవారం ఉదయం పనసచెట్టుకు ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. శరీరంపై గాయాలుండటంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు, తవణంపల్లె ఇన్‌చార్జి ఎస్‌ఐ చిరంజీవి తమ సిబ్బందితో కలసి పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. మృతుడి తలపై గాయాలతో పాటు, పొలంలో అక్కడక్కడా రక్తపుమరకలు కనిపించడంతో హత్యచేసి చెట్టుకు వేలాడదీసినట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో హత్య కేసుగా నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.