Share News

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:19 AM

ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని చిన్నారిసహా ఆరుగురిని స్థానికులు కాపాడారు.

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
- మంటల్లో కారు (ఇన్‌సెట్లో) పూర్తిగా దగ్ధమయ్యాక..

బంగారుపాళ్యం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని చిన్నారిసహా ఆరుగురిని స్థానికులు కాపాడారు. ఆపై కారులో మంటలు చెలరేగడంతో దగ్ధమైంది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి చెందిన తాండవమూర్తికి పక్షవాతం బారినపడ్డాడు. దాంతో తాండవమూర్తిని తీసుకుని ఆయన కుమారుడు కార్తీకేయ తన కుటుంబీకులైన సంపత్‌ కుమారి, వేలాయుధం, అశ్విని, ఏడాదిన్నర వయస్సు ఉన్న రక్షితతో కలిసి శనివారం రాత్రి కారులో పలమనేరు సమీపంలోని విరూపాక్షపురానికి వచ్చారు. అక్కడ వైద్యం చేయించుకుని ఆదివారం ఉదయం తిరిగి కాంచీపురానికి బయల్దేరారు. మార్గమధ్యంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై బంగారుపాళ్యం మండలం పాలేరు సమీపంలోని లక్కీ డాబా ఎదురుగా కారు అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడి కొంతదూరం జారుకుంటూ వెళ్లి ఆగింది. ఈ రాపిడికి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే వాహనంలోని ఆరుగురినీ బయటకు తీశారు. ఆ తర్వాత మంటలు అధికమై వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో చిన్నారికితప్ప మిగిలినవారికి స్వల్పగాయాలవడంతో 108 అంబులెన్స్‌లో బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో జనసంచారం ఉండటం వల్లే కారులోని వారు ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు.

Updated Date - Jul 14 , 2025 | 12:19 AM