Share News

తొలి రోజు 95 శాతం పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - May 02 , 2025 | 01:26 AM

ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్‌ పంపిణీలో భాగంగా తొలి రోజైన గురువారం జిల్లాలో 95 శాతం పంపిణీ చేశారు.

తొలి రోజు 95 శాతం పింఛన్ల పంపిణీ

చిత్తూరు సెంట్రల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్‌ పంపిణీలో భాగంగా తొలి రోజైన గురువారం జిల్లాలో 95 శాతం పంపిణీ చేశారు. జిల్లాలో 2,63,728 మంది లబ్ధిదారులకు 2,50,808 మందికి పంపిణీ చేశారు. 12,920 మందికి పింఛన్‌ పంపిణీ చేయాల్సి ఉంది. నూతన నిబంధనల మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం ఏడు గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను సొమ్ము అందజేశారు. మిగిలినవారికి మరో రెండ్రోజుల్లో అందజేయనున్నట్లు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ శ్రీదేవి.. పుంగనూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీని పరిశీలించారు. గ్రామాల్లో ఎంపీడీవోలు, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల్లో కమిషనర్లు పర్యవేక్షించారు.

Updated Date - May 02 , 2025 | 01:26 AM