94.88 శాతం పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Oct 02 , 2025 | 01:41 AM
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ తొలిరోజైన బుధవారం 94.88శాతం జరిగింది. జిల్లావ్యాప్తంగా 2,68,307మంది పెన్షనర్లకు గానూ 2,54,571 మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేశారు.
చిత్తూరు సెంట్రల్, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ తొలిరోజైన బుధవారం 94.88శాతం జరిగింది. జిల్లావ్యాప్తంగా 2,68,307మంది పెన్షనర్లకు గానూ 2,54,571 మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేశారు. గురువారం సెలవుదినం కావడంతో, మిగిలిన 13,736 మందికి శుక్రవారం అందజేయనున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీ సాధారణంగా ఉదయం 6.30 గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సచివాలయాల సిబ్బంది నిరసన కారణంగా పలు చోట్ల ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైంది.దీంతో రాత్రి 7 గంటల సమయానికి 94.88శాతం పింఛన్లను సిబ్బంది పంపిణీ చేయగలిగారు.