Share News

94.55శాతం పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:51 AM

ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ తొలిరోజైన సోమవారం 94.55 శాతం పూర్తయింది.జిల్లావ్యాప్తంగా 2,67,292 మందికి గాను 2,52,732 మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేశారు.

94.55శాతం పింఛన్ల పంపిణీ

చిత్తూరు సెంట్రల్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ తొలిరోజైన సోమవారం 94.55 శాతం పూర్తయింది.జిల్లావ్యాప్తంగా 2,67,292 మందికి గాను 2,52,732 మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేశారు. మిగిలిన 14,560 మందికి మంగళవారం అందించనున్నారు.కాగా పింఛన్ల పంపిణీలో 95.18 శాతంతో కుప్పం పురపాలక సంఘం జిల్లాలో ప్రథమ స్థానం సాధించింది.అంతేకాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోని శాంతిపురం, కుప్పం మండలాలు పింఛన్ల పంపిణీలో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు పొందాయి. శాంతిపురం మండలంలో 8,613 పింఛన్లుండగా 8,166 పింఛన్లు పంపిణీ చేసి 94.81 శాతంతో ద్వితీయ స్థానం సాఽధించింది. అలాగే కుప్పం మండల పరిఽధిలో 9,763 పింఛన్లుండగా 9167 పింఛన్లు పంపిణీ చేసి 93.9 శాతంతో తృతీయ స్థానం పొందింది. పాలసముద్రం మండలం 86.64 శాతం మాత్రమే పింఛన్లు పంపిణీ చేసి ఆఖరు స్థానంలో నిలిచింది.

Updated Date - Dec 02 , 2025 | 01:51 AM