Share News

88.36శాతం పల్స్‌పోలియో

ABN , Publish Date - Dec 22 , 2025 | 02:04 AM

జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే జగన్మోహన్‌, మేయర్‌ అముద పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.

 88.36శాతం పల్స్‌పోలియో
పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే జగన్మోహన్‌

చిత్తూరు రూరల్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే జగన్మోహన్‌, మేయర్‌ అముద పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.జిల్లాలో 5 సంవత్సరాల లోపు పిల్లలు 2,21,502 మంది వున్నట్లు గుర్తించి 142 రూట్లలో 212 వాహనాల ద్వారా పోలియో చుక్కలను పంపిణీ చేశారు. 1415 బూత్‌లు, 5800 మంది సిబ్బందితో 2,94,600 పోలియో వాక్సిన్‌ వైల్స్‌ను వినియోగించారు. మొదటి రోజు 88.36 శాతం అంటే 1,84,648 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు డీఐవో హనుమంతరావు తెలిపారు.మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Dec 22 , 2025 | 02:04 AM