Share News

పీజీ సెట్‌ ఫలితాల్లో ఎస్వీయూ పరిధిలో 87 శాతం ఉత్తీర్ణత

ABN , Publish Date - Jun 26 , 2025 | 01:28 AM

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ పీజీసెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఏడాది ఎస్వీ యూనివర్సిటీ ఈ పరీక్ష నిర్వహించింది. ఈ ఫలితాల వివరాలను ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రారు మాదాల భూపతి నాయుడు పీజీ సెట్‌ కన్వీనరు, ఓఆర్‌ఐ ప్రొఫెసర్‌ పీసీ వెంటేశ్వర్లు వెల్లడించారు.

పీజీ సెట్‌ ఫలితాల్లో ఎస్వీయూ పరిధిలో 87 శాతం ఉత్తీర్ణత
ఫలితాలు విడుదల చేస్తున్న ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతి నాయుడు, పీజీసెట్‌ కన్వీనర్‌ వెంకటేశ్వర్లు తదితరులు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ పీజీసెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఏడాది ఎస్వీ యూనివర్సిటీ ఈ పరీక్ష నిర్వహించింది. ఈ ఫలితాల వివరాలను ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రారు మాదాల భూపతి నాయుడు పీజీ సెట్‌ కన్వీనరు, ఓఆర్‌ఐ ప్రొఫెసర్‌ పీసీ వెంటేశ్వర్లు వెల్లడించారు. ఎస్వీయూ రీజియన్‌లో పీజీసెట్‌కు 6800 మంది దరఖాస్తు చేసుకోగా, 5764 మంది పరీక్ష రాశారు. వీరిలో 5019 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లోని 143 సబ్జెక్టులలో పీజీ ప్రవేశానికిగాను 31 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రేమ్‌కుమార్‌ జనరల్‌.. దివ్యే్‌షరెడ్డి జాగ్రఫీలో ప్రథమ ర్యాంకు సాధించారు. పీజీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో వేగం, పారదర్శకత పాటించినట్టు అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీడీసీ డీన్‌ చెండ్రాయుడు, రీసెర్చ్‌ డీన్‌ నరసింహ, కల్చరల్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ పత్తిపాటి వివేక్‌ చౌదరి, ప్రిన్సిపాళ్ళు నరసయ్య, శ్రీనివాసులు, పద్మావతి, సుధారాణి, డెవల్‌పమెంట్‌ డీన్‌ బాలాజీ, పీజీసెట్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 01:28 AM