టెట్‌కు 78 మంది గైర్హాజరు
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:39 AM
జిల్లాలో తొలి రోజైన బుధవారం టెట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఐదు కేంద్రాల్లో 800 మంది అభ్యర్థులకు గాను 722 మంది హాజరు కాగా, 78 మంది గైర్హాజరయ్యారు.
చిత్తూరు సెంట్రల్, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి రోజైన బుధవారం టెట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఐదు కేంద్రాల్లో 800 మంది అభ్యర్థులకు గాను 722 మంది హాజరు కాగా, 78 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 540 మందికి 486 మంది హాజరుకాగా, 54 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో 260 మందికి గాను 236 మంది హాజరుకాగా 24 మంది గైర్హాజరయ్యారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతించారు. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ పరీక్షలు నిర్వహించారు.