7 వేల బంగారు కుటుంబాలు
ABN , Publish Date - Jul 04 , 2025 | 01:54 AM
తిరుపతి నియోజకవర్గంలో ఏడు వేల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనరు మౌర్య తెలిపారు. సేవారంగం బలోపేతంతోనే తిరుపతి సమగ్ర అభివృద్ధి సాధిస్తుందన్నారు. తిరుపతి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కమిటీ చైర్మన్ అయిన ఎమ్మెల్యే ఆరణి ఆధ్వర్యాన గురువారం కార్పొరేషన్ సమావేశమందిరంలో సమావేశం జరిగింది. 2047నాటికి నియోజకవర్గం ఎలా.. ఏయే రంగాల్లో అభివృద్ధి జరుగుతుందనే అంచనాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వార్డు కార్యదర్శలు వివరించారు. 2029 నాటికి 10 మార్గదర్శకాల అమలుతో తిరుపతి అభివృద్ధిలో కీలక మైలురాయిని చేరుకోవడం సాధ్యమని కమిటీ వైస్ ఛైర్మన్, కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న కమిషనరు ఎన్.మౌర్య తెలిపారు. జీరో పావర్టీని సాధించడం కోసం పీ4 విధానాన్ని అమలు చేయడంలో మార్గదర్శులే కీలకమని చెప్పారు.
తిరుపతిలో గుర్తించామన్న
ఎమ్మెల్యే, కమిషనరు
2029 నాటికి పేదరికంలేని
నగరంగా తిరుపతి
తిరుపతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నియోజకవర్గంలో ఏడు వేల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనరు మౌర్య తెలిపారు. సేవారంగం బలోపేతంతోనే తిరుపతి సమగ్ర అభివృద్ధి సాధిస్తుందన్నారు. తిరుపతి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కమిటీ చైర్మన్ అయిన ఎమ్మెల్యే ఆరణి ఆధ్వర్యాన గురువారం కార్పొరేషన్ సమావేశమందిరంలో సమావేశం జరిగింది. 2047నాటికి నియోజకవర్గం ఎలా.. ఏయే రంగాల్లో అభివృద్ధి జరుగుతుందనే అంచనాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వార్డు కార్యదర్శలు వివరించారు. 2029 నాటికి 10 మార్గదర్శకాల అమలుతో తిరుపతి అభివృద్ధిలో కీలక మైలురాయిని చేరుకోవడం సాధ్యమని కమిటీ వైస్ ఛైర్మన్, కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న కమిషనరు ఎన్.మౌర్య తెలిపారు. జీరో పావర్టీని సాధించడం కోసం పీ4 విధానాన్ని అమలు చేయడంలో మార్గదర్శులే కీలకమని చెప్పారు. సమావేశానికి హాజరైన బంగారు కుటుంబాల వారి ఆవేదనను మార్గదర్శకులు విని తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ‘స్వర్ణాంధ్ర 2047 సాధనకు తిరుపతి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. టూరిజం అభివృద్ధితో నియోజకవర్గం అభివృద్ధి ముడిపడి ఉంది. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తిరుపతిని మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉంది. విశాఖపట్నం, విజయవాడలకు దీటుగా తిరుపతిని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కట్టుబడి ఉన్నారు. తిరుపతిలో నూతన రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో పాటు త్వరలో ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ నిర్మాణం పనులకు టెండర్లు పిలవనున్నారు. తిరుపతిలో ఐటీ సెక్టార్ అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనేది నా ఆకాంక్ష’ అని ఎమ్మెల్యే ఆరణి వివరించారు. రేణిగుంట- చంద్రగిరి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినట్లు కమిషనర్ మౌర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అదనపు కమిషనర్ చరణ్‌తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఎస్‌ఈ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసీమ్, డీఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.