Share News

జిల్లాలో 4252 విగ్రహాల నిమజ్జనం

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:50 AM

‘వినాయక చవితి సందర్భంగా జిల్లాలో 4670 విగ్రహాలను ఏర్పాటు చేశారు. సోమవారం వరకు 4252 విగ్రహాలను నిమజ్జనం చేశారు’ అని ఎస్పీ హర్షవర్ధనరాజు పేర్కొన్నారు.

జిల్లాలో 4252 విగ్రహాల నిమజ్జనం
కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ

తిరుపతి (నేరవిభాగం), సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘వినాయక చవితి సందర్భంగా జిల్లాలో 4670 విగ్రహాలను ఏర్పాటు చేశారు. సోమవారం వరకు 4252 విగ్రహాలను నిమజ్జనం చేశారు’ అని ఎస్పీ హర్షవర్ధనరాజు పేర్కొన్నారు. మరో ఐదు రోజులలో 458 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఎస్పీలకు సూచించారు. ఈ మేరకు ఆయా డీఎస్పీలతో ఆయన మాట్లాడి.. నిమజ్జనం జరిగే ప్రదేశాలు.. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చీకటి పడేట్లయితే నిమజ్జనం చేసే ప్రాంతంలో లైటింగ్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెద్ద పెద్ద వాహనాల్లో విగ్రహాలను తీసుకొస్తే..అందులోని ప్రజలను నదిఒడ్డున దిం పాలని, ఐదుగురినే విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు అనుమతించాలన్నారు. జాతీయ రహదారులపై ట్రాఫిక్‌ కు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. డ్రోన్లతోనూ బీట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి సహా మిగిలిన ప్రాంతాల్లో ఆదివారం వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా సహకరించిన నిర్వాహకులకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 02 , 2025 | 01:50 AM