తిరుపతి టీడీపీ పార్లమెంటు కమిటీకి 42 మంది
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:36 AM
తిరుపతి టీడీపీ పార్లమెంటు కమిటీని అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా డాలర్స్ దివాకర్‌రెడ్డిలతో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 42 మంది ఉన్నారు.
14 మంది మహిళలు, ముగ్గురు ముస్లిం మైనారిటీలకు చోటు
తిరుపతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతి టీడీపీ పార్లమెంటు కమిటీని అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా డాలర్స్ దివాకర్‌రెడ్డిలతో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 42 మంది ఉన్నారు.
ఉపాధ్యక్షులు: పామాంజి హేమలత (సూళ్లూరుపేట), కుంకల దశరధ నాగేంద్ర (సర్వేపల్లి), ఎ.యశ్వంత్‌రెడ్డి (తిరుపతి), ఉచ్చూరు వెంకటేశ్వరరెడ్డి (గూడూరు), పామాంజి వాసు, సి.కృష్ణయ్య (సత్యవేడు), మల్లారం బాబు (వెంకటగిరి), ఆర్.చెంచయ్య నాయుడు, కూనాటి లోకేశ్వరి (శ్రీకాళహస్తి).
కార్యనిర్వాహక కార్యదర్శులు:
గర్తాటి ఉదయ్ కుమార్, డేగా వెంకయ్య (సర్వేపల్లి), తుపాకుల కన్నెమ్మ (సూళ్లూరుపేట), రాందాస్ మునిరామయ్య (తిరుపతి), ఏసుపాక పెంచలయ్య (గూడూరు), ఎండీ కుమార్ (సత్యవేడు), జడపల్లి కోటేశ్వరరావు, పి.మాధవి (వెంకటగిరి), గాలి కృష్ణవేణి (శ్రీకాళహస్తి).
అధికార ప్రతినిధులు: కామిరెడ్డి మురళీరెడ్డి (సూళ్లూరుపేట), ఎస్‌కే అమీర్ బాషా (సర్వేపల్లి), ఊట్ల సురేంద్ర నాయుడు (తిరుపతి), ఎండీ అబ్దుల్ రహీం, కుంచం దయాకర్ (గూడూరు), జి.లక్ష్మీపతి రాజు (సత్యవేడు), రాజుల అనురాధ, ఇండ్ల అంకయ్య (వెంకటగిరి), వి.అనిత (శ్రీకాళహస్తి).
కార్యదర్శులు: షేక్ షబ్నా, వేలూరు రమణయ్య (సూళ్లూరుపేట), కొంగి మస్తానమ్మ (సర్వేపల్లి), ఎన్.రేవతి, జే.డబ్ల్యు విజయ్‌కుమార్ (తిరుపతి), సిద్ధపురెడ్డి పోలమ్మ (గూడూరు), ఎస్.ఉమామహేశ్వరి (సత్యవేడు), మగ్గం వెంకటాచలం (వెంకటగిరి), ఎం.వెంకటసుబ్బయ్య (శ్రీకాళహస్తి).
ట్రెజరర్: గుండాల భారతి (గూడూరు), కార్యాలయ కార్యదర్శిగా చింతా చెంగయ్య (తిరుపతి), మీడియా కోఆర్డినేటర్‌గా కందేరి కార్తీక్ (సత్యవేడు), సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా ఎం.రూపేష్ వర్మ (తిరుపతి).
తిరుపతి, గూడూరుకు ప్రాధాన్యం
తిరుపతి సెగ్మెంట్‌లో ప్రధాన కార్యదర్శి సహా మొత్తం 8 మందికి కమిటీలో అవకాశం దక్కింది. గూడూరులో అధ్యక్షురాలు, ట్రెజరర్‌తో పాటు మొత్తం ఏడుగురు నియమితులయ్యారు. ఇలా ఈ రెండు నియోజకవర్గాలకు ప్రాధాన్యం లభించింది. సత్యవేడు, వెంకటగిరి సెగ్మెంట్లలో ఆరు గురు చొప్పున.. సర్వేపల్లి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట సెగ్మెంట్లలో ఐదుగురు వంతున పదవులు పొందారు. ఇక 42 మందికి గానూ 14 మంది మహిళలున్నారు. ఏకంగా అధ్యక్ష పదవితో పాటు ట్రెజరర్, ఇద్దరు ఉపాధ్యక్షులు, ముగ్గురు ఆర్గనైజింగ్ కార్యదర్శులు, ఇద్దరు అధికార ప్రతినిధులు, ఐదుగురు కార్యదర్శులున్నారు. అలాగే ముస్లిం మైనారిటీలు ముగ్గురు వివిధ పదవుల్లో నియమితులయ్యారు.