వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు
ABN , Publish Date - Nov 10 , 2025 | 02:05 AM
కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి ఆదివారం నాలుగు గంటల సమయం పట్టింది. సెలవు రోజు కావంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు పూర్తిగా నిండి పోయి ఆలయం వెలుపల వరకు వ్యాపించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.
ఐరాల(కాణిపాకం), నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి ఆదివారం నాలుగు గంటల సమయం పట్టింది. సెలవు రోజు కావంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు పూర్తిగా నిండి పోయి ఆలయం వెలుపల వరకు వ్యాపించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.
నేటినుంచి పవిత్రోత్సవాలు
వరసిద్ధుడి ఆలయంలో సోమవారం నుంచి పవిత్రోత్సవాలను మూడ్రోజులపాటు నిర్వహించనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఆలయంలో పవిత్ర పూర్ణత్వసిద్ధి పొందుటకు, లోక క్షేమం కోసం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.