నవోదయ ప్రవేశ పరీక్షకు 3,248 మంది హాజరు
ABN , Publish Date - Dec 14 , 2025 | 02:15 AM
జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా నవోదయ ప్రిన్సిపాల్ గీత మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 23 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామన్నారు. 80 సీట్లకు 4,300 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. పరీక్షకు 3,248 మంది హాజరవగా, 1,052 మంది గైర్హాజరయ్యారన్నారు.
చిత్తూరు సెంట్రల్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా నవోదయ ప్రిన్సిపాల్ గీత మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 23 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామన్నారు. 80 సీట్లకు 4,300 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. పరీక్షకు 3,248 మంది హాజరవగా, 1,052 మంది గైర్హాజరయ్యారన్నారు. చిత్తూరు జిల్లాలో 12 సెంటర్లు, అన్నమయ్య జిల్లాలో 6, తిరుపతి జిల్లాలో 5 సెంటర్లలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. చిత్తూరులోని పరీక్ష కేంద్రాలను డీఈవో రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. పరీక్ష నిర్వహణలో జవహర్ నవోదయ పరీక్షల ఇన్‌చార్జి లక్ష్మీనారాయణ, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా ....
తిరుపతి(విద్య), డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026 విద్యా సంవత్సరానికిగాను జిల్లాలో శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో మొత్తం 10 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయని తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 2,060 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 848 మంది గైర్హాజరయ్యారని వివరించారు.
టెట్‌కు 98 మంది గైర్హాజరు
చిత్తూరు సెంట్రల్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఐదు కేంద్రాల్లో శనివారం నిర్వహించిన టెట్‌కు 98 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 962 మందికి864 మంది హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 481 మందికి 431 మంది హాజరవగా, మధ్యాహ్నం సెషన్‌లో 481 మందికి 433 మంది అభ్యర్థులు హాజరయ్యారు.