వరసిద్ధుడి దర్శనానికి 3 గంటలు
ABN , Publish Date - Jul 13 , 2025 | 01:42 AM
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. శనివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు స్వామి దర్శనార్థం ఆలయానికి విచ్చేశారు. క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి ఆలయం వెలుపలకు వ్యాపించాయి.
ఐరాల(కాణిపాకం), జూలై 12 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. శనివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు స్వామి దర్శనార్థం ఆలయానికి విచ్చేశారు. క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి ఆలయం వెలుపలకు వ్యాపించాయి. ప్రతి భక్తుడికీ స్వామి దర్శనం కల్పించేలా సిబ్బందితో కలిసి ఈవో పెంచలకిషోర్ క్యూలైన్లను పర్యవేక్షించారు.