పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు 264 మంది హాజరు
ABN , Publish Date - Jun 27 , 2025 | 01:08 AM
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకుగాను జిల్లాలో మూడు కేంద్రాల్లో ఆరో రోజైన గురువారం నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్‌కు 264 మంది హాజరయ్యారని జిల్లా కోఆర్డినేటర్, తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ వై. ద్వారకానాథ్‌రెడ్డి తెలిపారు.
తిరుపతి(విద్య), జూన్ 26(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకుగాను జిల్లాలో మూడు కేంద్రాల్లో ఆరో రోజైన గురువారం నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్‌కు 264 మంది హాజరయ్యారని జిల్లా కోఆర్డినేటర్, తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ వై. ద్వారకానాథ్‌రెడ్డి తెలిపారు. 86,001 నుంచి 1,04,000 ర్యాంకుల వారికి కౌన్సెలింగ్ జరిగింది. ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో కళాశాలలో జరిగిన కౌన్సెలింగ్‌కు 201 మంది హాజరయ్యారు. సత్యవేడులో 10 మంది, గూడూరులో 53 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరై తమ సర్టిఫికెట్లను ధ్రువీకరించుకున్నారు. శుక్రవారం 1,04,001 నుంచి 1,20,000 ర్యాంకుల వారికి కౌన్సెలింగ్ జరగనుంది.