Share News

నాయుడుపేటలో సిర్మా టెక్నాలజీ్‌సకు 26 ఎకరాలు

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:37 AM

నాయుడుపేటలో సిర్మా టెక్నాలజీస్‌ పరిశ్రమ ఏర్పాటుకు 26.70 ఎకరాల భూమి కేటాయింపునకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదించింది.

నాయుడుపేటలో సిర్మా టెక్నాలజీ్‌సకు 26 ఎకరాలు

ఏరో స్పేస్‌ సిటీలో స్కైరూట్‌ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం

మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు

తిరుపతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): నాయుడుపేటలో సిర్మా టెక్నాలజీస్‌ పరిశ్రమ ఏర్పాటుకు 26.70 ఎకరాల భూమి కేటాయింపునకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదించింది. రూ.1595 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేసి 2168 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఈ సంస్థ ప్రతిపాదించింది. పరిశ్రమతో పాటు జాయింట్‌ వెంచర్ల కింద ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు ప్లాంట్‌, కాపర్‌ క్లాడ్‌ లామినేట్‌ ప్లాంట్‌, ఈఎంఎస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించగా, 26.70 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

ఫ ఏరో స్పేస్‌ సిటీ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. ఈ స్పేస్‌ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి మెస్సర్స్‌ స్కై రూట్‌ ఏరో స్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకొచ్చింది. ఎస్‌ఐపీబీ సిఫారసులకు అనుగుణంగా పరిశ్రమల శాఖ చేసిన ప్రతిపాదన మేరకు స్కైరూట్‌ సంస్థకు ఎకరా రూ.5 లక్షల వంతున భూములు కేటాయించేందుకు మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. స్పేస్‌ సిటీలో ప్రభుత్వం ఎర్త్‌ పోర్టబుల్‌ ఇంజన్‌ టెస్టు ఫెసిలిటీ, క్రయోజనిక్‌ ఇంజన్‌ టెస్టు ఫెసిలిటీ, అదే ఫెసిలిటీ 2వ యూనిట్‌ వంటి సదుపాయాలను కల్పించనుంది.

ఫ దీర్ఘకాలంగా ఉన్న శెట్టిపల్లె సమస్యకు పరిష్కారం చూపింది.

ఫ తిరుపతి సహా 16 జిల్లాల్లో దీపం-2 పథకం కింద 5 కిలోల సిలిండర్లు తీసుకున్న వారికి కూడా 14.2 కిలోల కేటగిరీలో ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు దక్కేలా మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జిల్లాలో కనీసం 2 వేల కుటుంబాలకు మేలు జరగనుంది.

Updated Date - Sep 05 , 2025 | 01:37 AM