తిరుపతి ఐఐటీకి రూ.2,300 కోట్లు
ABN , Publish Date - May 15 , 2025 | 01:49 AM
ఏర్పేడు వద్దనున్న కేంద్రియ విద్యా సంస్థ తిరుపతి ఐఐటీకి కేంద్ర ప్రభుత్వం రూ.2,300 కోట్లు మంజూరు చేసినట్లు ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ బుధవారం తెలిపారు. ఈ నిధులతో ఐఐటీ ప్రాంగణంలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. ‘
ఏర్పేడు, మే 14(ఆంధ్రజ్యోతి): ఏర్పేడు వద్దనున్న కేంద్రియ విద్యా సంస్థ తిరుపతి ఐఐటీకి కేంద్ర ప్రభుత్వం రూ.2,300 కోట్లు మంజూరు చేసినట్లు ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ బుధవారం తెలిపారు. ఈ నిధులతో ఐఐటీ ప్రాంగణంలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. ‘2015లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐఐటీల్లో తిరుపతి ఐఐటీ ఒకటి. 2017-24 వరకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ1,100కోట్లు మంజూరు చేసింది. 2017 నుంచి ఏర్పేడు వద్ద ఐఐటీ ప్రాంగణంలో పనులు ప్రారంభమయ్యాయి. ఐఐటీని మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను మంజూరు చేసింది. ఇక్కడ చదువుకునే విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి మా బోధన సిబ్బంది ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు’ అని ఆయన వివరించారు.