200 పింఛన్లు
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:40 AM
‘పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేదు. దీంతో పీజీఆర్‌ఎ్‌సకు వచ్చే క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, సర్వం కోల్పోయి వచ్చిన వారికి న్యాయం చేయలేకపోతున్నాం. పింఛన్ల మంజూరులో ప్రత్యేక అధికారాలు కల్పించాలి’ అని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల రెండో రోజు సదస్సులో వెంకటేశ్వర్‌తో కోరారు. దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్లకు 200 పింఛన్లు మంజూరు చేయడానికి వెసలుబాటు కల్పిస్తున్నామని, ఇది అన్ని జిల్లాలకు వర్తిస్తుందని సీఎం ప్రకటించారు. ఇక జిల్లాలో నీటి సంరక్షణ, గ్లోబల్ లాజిస్టిక్ టెక్నాలజీ, జీరో పావర్టీ, హ్యూమన్ రీసెర్స్ వంటి అంశాల్లో పనితీరు బాగుందని, మరింత చురుగ్గా పని చేయాలని చంద్రబాబు సూచించారు. మారిన జీవన విధానం, ఆలస్య పెళ్లిళ్లు వల్ల సంతానోన్పత్తి తగ్గుతోందని, ఈ క్రమంలో అంత్యత ఖరీదైన ఫెర్టిలిటీ సేవలను ఎన్టీఆర్ వైద్యసేవలో చేరిస్తే బాగుంటుందని కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జీవన విధానంపై యువతను ఎడ్యుకేట్ చేయడం, అదే సమయంలో చికిత్స కూడా అవసరమేనని, హెల్త్‌ప్లానింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కుప్పంలో ఓ ఎన్జీవో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి ఒక్కరికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారని అదే తరహాలో అంతటా తీసుకురావడానికి చర్యలు ప్రారంభిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో తిరుమల క్షేత్రంపై వచ్చే అసత్య కథనాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్ మంజూరు చేయడానికి వెసులుబాటు
వెంకటేశ్వర్ విజ్ఞప్తికి సీఎం సానుకూల స్పందన
తిరుపతి(కలెక్టరేట్), డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేదు. దీంతో పీజీఆర్‌ఎ్‌సకు వచ్చే క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, సర్వం కోల్పోయి వచ్చిన వారికి న్యాయం చేయలేకపోతున్నాం. పింఛన్ల మంజూరులో ప్రత్యేక అధికారాలు కల్పించాలి’ అని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల రెండో రోజు సదస్సులో వెంకటేశ్వర్‌తో కోరారు. దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్లకు 200 పింఛన్లు మంజూరు చేయడానికి వెసలుబాటు కల్పిస్తున్నామని, ఇది అన్ని జిల్లాలకు వర్తిస్తుందని సీఎం ప్రకటించారు. ఇక జిల్లాలో నీటి సంరక్షణ, గ్లోబల్ లాజిస్టిక్ టెక్నాలజీ, జీరో పావర్టీ, హ్యూమన్ రీసెర్స్ వంటి అంశాల్లో పనితీరు బాగుందని, మరింత చురుగ్గా పని చేయాలని చంద్రబాబు సూచించారు. మారిన జీవన విధానం, ఆలస్య పెళ్లిళ్లు వల్ల సంతానోన్పత్తి తగ్గుతోందని, ఈ క్రమంలో అంత్యత ఖరీదైన ఫెర్టిలిటీ సేవలను ఎన్టీఆర్ వైద్యసేవలో చేరిస్తే బాగుంటుందని కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జీవన విధానంపై యువతను ఎడ్యుకేట్ చేయడం, అదే సమయంలో చికిత్స కూడా అవసరమేనని, హెల్త్‌ప్లానింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కుప్పంలో ఓ ఎన్జీవో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి ఒక్కరికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారని అదే తరహాలో అంతటా తీసుకురావడానికి చర్యలు ప్రారంభిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో తిరుమల క్షేత్రంపై వచ్చే అసత్య కథనాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్డు ప్రమాదాలపై చర్యలు తీసుకోండి
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): కలెక్టర్ల సదస్సులో గురువారం శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రోడ్డు ప్రమాదాలపై విశ్లేషించి, బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ వాడకంపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు కలసి కట్టుగా పనిచేసే విధానం బాగుందని అభినందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా నుంచి కలెక్టర్‌తో పాటు ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.