19 మంది ఎస్‌ఐలకు స్థానచలనం
ABN , Publish Date - Dec 22 , 2025 | 02:05 AM
జిల్లాలో 19 మంది ఎస్‌ఐలకు స్థానచలనం కల్పిస్తూ ఎస్పీ సుబ్బరాయుడు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 19 మంది ఎస్‌ఐలకు స్థానచలనం కల్పిస్తూ ఎస్పీ సుబ్బరాయుడు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలిపిరిలో పనిచేస్తున్న స్వాతిని శ్రీకాళహస్తి వన్‌టౌన్‌కు, తిరుచానూరు జగన్నాథరెడ్డిని మహిళా స్టేషన్‌కు, తిరుపతి సీసీఎస్ సాయినాథ చౌదరిని సత్యవేడుకు, తొట్టంబేడు వెంకటరమణను తిరుమల టూటౌన్‌కు, శ్రీసిటీ చిత్రి తరుణ్‌ను పాకాలకు, డీసీఆర్‌బీ తలారి ఓబయ్యను కేవీబీపురానికి బదిలీ చేశారు. శ్రీకాళహస్తి టూటౌన్ పార్థసారథిని డీసీఆర్‌బీకి, అలిపిరి లోకే్‌షకుమార్‌ను ఎస్బీ తిరుపతికి, వెస్ట్ పీఎస్ అనిల్‌కుమార్‌ను ఎస్బీ తిరుపతికి, సత్యవేడు రామస్వామిని తిరుపతి ఈస్ట్‌కు, శ్రీకాళహస్తి వన్‌టౌన్ అరుణను తిరుచానూరుకు బదిలీ చేశారు. అలాగే వీఆర్‌లో ఉన్న నాగరాజును ట్రాఫిక్‌కు, నరే్‌షను తిరుమల సీసీఎ్‌సకు, రవిప్రకాష్ రెడ్డిని చంద్రగిరికి, నాగార్జున రెడ్డిని సీసీఎస్ తిరుపతికి, బలరామయ్యను తిరుమల ట్రాఫిక్‌కు, మహబూబ్ బాషాను తిరుపతి ట్రాఫిక్‌కు, రవిప్రకా్‌షను ఏర్పేడుకు, సంజీవరాయుడిని తిరుమల ట్రాఫిక్‌కు మార్చారు.