Share News

1.5 కిలోల గంజాయి స్వాధీనం: ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Nov 01 , 2025 | 01:57 AM

నగరి మండల పరిధిలోని తడుకుపేట సమీపంలో గంజాయి తీసుకెళుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్దనుంచి 1.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

1.5 కిలోల గంజాయి స్వాధీనం: ముగ్గురి అరెస్టు

నగరి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): నగరి మండల పరిధిలోని తడుకుపేట సమీపంలో గంజాయి తీసుకెళుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్దనుంచి 1.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ విక్రమ్‌ తెలిపిన వివరాల మేరకు.. గంజాయి తీసుకెళుతుండగా తడుకుపేటకు చెందిన సుమన్‌(42), దేవా(22), ఇందిరానగర్‌కు చెందిన తరుణ్‌(20)లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.5కిలోల గంజాయిని, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నగరి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Nov 01 , 2025 | 01:57 AM