నంద్యాలలో చైనస్నాచింగ్
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:20 AM
నంద్యాల వనటౌన పోలీస్‌స్టేషన పరిధిలోని కోటవీధిలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మహిళ మెడలోని చైన అపహరించుకుని పరారయ్యారు.

నంద్యాల క్రైం, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): నంద్యాల వనటౌన పోలీస్‌స్టేషన పరిధిలోని కోటవీధిలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మహిళ మెడలోని చైన అపహరించుకుని పరారయ్యారు. వనటౌన సీఐ సుధాకర్‌రెడ్డి, బాధితురాలు ఆదిలక్ష్మి తెలిపిన మేరకు వివరాలు... డోనకు చెందిన ఆదిలక్ష్మి పట్టణంలోని జగజ్జననీదేవి ఆలయాన్ని సందర్శించేందుకు నంద్యాలకు చేరుకున్నారు. మంగళవారం అమ్మవారిని దర్శించుకుని బంధువుల ఇంటికి బయల్దేరింది. మార్గమధ్యంలో కోటవీధిలో నడుస్తూ వెలుతున్న ఆదిలక్ష్మి వెనుకవైపు నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు మహిళ మెడలోని ఐదు తులాల గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.