Share News

చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు విచారణ ప్రారంభం

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:46 PM

పత్తికొండ వైసీపీ నియోజకవర్గం ఇనచార్జిగా పని చేసిన చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు విచారణ సోమవారం స్థానిక జిల్లా సెషన్స కోర్టులో ప్రారంభమైంది.

చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు  విచారణ ప్రారంభం

కర్నూల లీగల్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ వైసీపీ నియోజకవర్గం ఇనచార్జిగా పని చేసిన చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు విచారణ సోమవారం స్థానిక జిల్లా సెషన్స కోర్టులో ప్రారంభమైంది. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డిపై క్రిష్ణగిరి మండలంలో దాడి జరిగింది. ఈ దాడిలో నారాయణరెడ్డితోపాటు అతని అనుచరుడు సాంబశివుడు కూడా హత్యకు గురయ్యారు. నారాయణరెడ్డి అనుచరుడు కృష్ణమోహన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 18 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే.. కేసులో నిందితులుగా పేర్కొన్న ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కప్పట్రాళ్ల బొజ్జమ్మల పేర్లను హైకోర్టు ఆదేశాలతో తొలగించారు. కేసులో నిందితుడుగా ఉన్న ఒక వ్యక్తి మృతి చెందగా.. మిగతా 15 మందిపై సోమవారం విచారణ జరిగింది. కేసులో ఫిర్యాది అయిన కృష్ణమోహన ప్రాసిక్యూషన తరపున తన వాంగ్మూలాన్ని కోర్టులో ఇచ్చారు. తదుపరి విచారణకు కేసు వాయిదా పడింది.

Updated Date - Jan 06 , 2025 | 11:46 PM