Share News

నేటి నుంచి చౌడేశ్వరిదేవి జాతర ఉత్సవాలు

ABN , Publish Date - Feb 09 , 2025 | 11:45 PM

కోడుమూరు పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఉత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.

నేటి  నుంచి చౌడేశ్వరిదేవి జాతర ఉత్సవాలు
చౌడేశ్వరదేవి అమ్మవారు

కోడుమూరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): కోడుమూరు పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఉత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సోమవారం గుమ్మటోత్సవ కార్యక్రమంతో అమ్మవారి జాతర ఉత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. ఉదయం నుంచి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 11న ప్రభోత్సవం, 12న నంది ధ్వజశావ, 13న రథోత్సవం, 14న తిరుగు రథోత్సవం, 15న పారువేట, 16న వసంతోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.

12 నుంచి క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలు ప్రారంభం

చౌడేశ్వరదేవి జాతర పురస్కరించుకొని ఈ నెల 12 నుంచి 14 వరకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ స్టీరింగ్‌ కమిటీ సర్వం సిద్ధం చేశారు. దాతల సహకారంలో అంగరంగ వైభవంగా ఆటల పోటీలు, సంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 12న ఉదయం 8 గంటలకు స్లోసైకిల్‌ రేస్‌ పందెం, 10గంటలకు దీక్ష స్కూల్లో చదరంగం పోటీలు, ఉదయం 11 గంటలకు సంత మార్కెట్లో జిల్లా స్థాయి కబడ్డీ, సాయంత్రం వ్యాసరచన పోటీలు ఉంటాయి. స్థానిక మండల పరిషత్‌ ఆవరణలో 6 గంటలకు ఓపెన్‌ షటిల్‌ బాట్మింటన్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 13న ఉదయం సంత మార్కెట్లో గోనెసంచితో పరిగెత్తు పోటీలు, 10 గంటలకు పొట్టేళ్ల పోటీలు అలాగే పోలీసులు సహకరంతో జడ్పీ హైస్కూల్‌ మైదానంలో వాలీబాల్‌ పోటీలు, మధ్యాహ్నం 12 గంటలకు సంత మార్కెట్లో రుచి తిండి వీరుల పోటీలు జరగనున్నాయి. అంతేకాకుండా తప్పెట, చిన్నారి అందాల పోటీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 14న ఉదయం తేరుబజారులో ముగ్గుల పోటీలు, సాయంత్ర సంతమార్కెట్లో మూజికల్‌ చైర్స్‌ పోటీలు, సాయంత్రం డ్యాన్స్‌ బేబి డ్యాన్స్‌ కార్య్రమాన్ని చేపట్టనున్నారు. అపర్ణ స్టార్‌ నెట్‌వర్క్‌ అధినేత ఎస్‌జీ శంకర్‌బాబు అన్ని రకాల ఆటల పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ ఉత్సవాలకు మండలం నుంచే కాకుండా కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ ప్రాంతాల నుంచి హాజరవుతారు.

Updated Date - Feb 09 , 2025 | 11:45 PM