Share News

Fishermen Welfare: మత్స్యకారులకు పండగే

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:11 AM

వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.20 వేలు చొప్పున సాయం అందిస్తూ 1.29 లక్షల కుటుంబాలకు రూ.258 కోట్లు మంజూరు కానున్నాయి.

Fishermen Welfare: మత్స్యకారులకు పండగే

నేడు ‘మత్స్యకారుల సేవలో’ పథకానికి చంద్రబాబు శ్రీకారం

ఒక్కొక్క జాలరి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం

1.29 లక్షల కుటుంబాలకు లబ్ధి.. రూ.258 కోట్ల విడుదల

వేట నిషేధ కాలంలో సర్కారు దన్ను.. జగన్‌ పాలనలో 10 వేలే

రెట్టింపు చేస్తానని బాబు హామీ.. సిక్కోలులో నేడు నిధులు విడుదల

అమరావతి/శ్రీకాకుళం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వేట నిషేధ కాలంలో జీవనాధారం కోల్పోతున్న జాలర్ల కుటుంబాలకు.. ప్రభుత్వం రూ.20 చొప్పున సాయం చేయనుంది. రాష్ట్రంలోని 1,29,178 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.258 కోట్లను అందించనుంది. ‘మత్స్యకారుల సేవలో..’ అనే ఈ పథకానికి శనివారం శ్రీకాకుళం జిల్లా.. ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు శ్రీకా రం చుట్టనున్నారు. మత్స్యకారులకు, ఆక్వా రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న నమ్మకాన్ని నిజం చేయనున్నారు. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే మరో వాగ్దానాన్ని నెరవేస్తున్నారు. మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునే పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నెల 15 నుంచి జూన్‌ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను నిషేఽధించారు. దీంతో మత్స్యకార కుటుంబాలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి రూ.20 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేట నిషేధ సమయంలో గత జగన్‌ ప్రభుత్వం ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చింది.

ghj.jpg

అది కూడా చాలా మందికి దక్కలేదన్న విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా కరెంటు బిల్లులు, ఇతరత్రా కారణాలు చూపి చాలా మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. ఇక, ఎన్నికల ఏడాది(2024)లో ఎవరికీ పైసా ఇవ్వకుండా ‘కోడ్‌’ పేరుతో తప్పించుకున్నారు. రెండు నెలల పాటు వేటకు వెళ్లకపోతే మ త్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందనే విషయాన్ని అర్ధం చేసుకుని, ఎన్నికల ముందే మత్స్యకార కు టుంబాలకు రూ.10 వేల సాయాన్ని రూ. 20 వేలకు పెంచుతామని కూటమి మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఆ హామీని సీఎం చంద్రబాబు శనివారం నెరవేర్చనున్నారు.


మొదలు పెట్టింది చంద్రబాబే

రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో నగదు రూపంలో సాయం చేయడం ప్రారంభించింది. తొలుత ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి రూ.2 వేలు చొప్పున సాయం చేసిన సీఎం చంద్రబాబు దాన్ని 2018-19లో రూ.4 వేలకు పెంచారు. దీనికిగాను 2014-19 మధ్య రూ.788 కోట్లు వెచ్చించారు. దీంతో పాటు వలలు, పడవలు, ఐస్‌బాక్సులు అదనంగా అందించారు. మత్స్యకారుల పిల్లలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆరు ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి, మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేసింది.


నేడు శ్రీకాకుళానికి సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. ఎచ్చర్ల నియోజకవర్గంలో ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఇదే జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పరిశీలించారు. సీఎం చంద్రబాబు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి శనివారం ఉదయం 11.35 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి బుడగట్లపాలెం చేరుకుంటారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడి వేట నిషేధ కాలంలో వారు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం, ఒక్కొక్క మత్స్యకారుడి కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 04:11 AM