చాంద్‌బాషా మృతి పార్టీకి తీరని లోటు
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:23 AM
ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ సుద్దపల్లె చాంద్‌బాషా మృతి పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే భూ మా అఖిలప్రియ అన్నారు.

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), జనవరి 29(ఆంధ్రజ్యోతి) : ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ సుద్దపల్లె చాంద్‌బాషా మృతి పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే భూ మా అఖిలప్రియ అన్నారు. ఇటీవల జరిగిన రహదారి ప్రమాదంలో చాంద్‌బాషా మృతిచెందడంతో ఆయన కుటుంబసభ్యులను ఎమ్మెల్యే బుధవారం పరామర్శించారు. కుటుంబీకులను ఆమె ఓదార్చి ధైర్యం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం, భూమా కుటుంబం ఎళ్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చాంద్‌బాషా పిల్లల చదువుకు తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు.
జగన ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
ఆళ్లగడ్డ(శిరివెళ్ల) : జగన ప్రభుత్వంలో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అఖిలప్రియ బుధవారం మాట్లాడుతూ వైసీపీ హయాంలో చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పుకు ప్రతి ఏడాది రూ.71 వేల కోట్ల అసలు, 1.40 లక్షల కోట్ల వడ్డీ చెల్లింపు భారం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి గుదిబండగా మారిందన్నారు. జగన ప్రభుత్వం తెచ్చిన అప్పులు రాషా్ట్రభివృద్ధికి కాకుండా విలాసాలకు వినియోగించారని ఆమె మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.