Share News

Flat Co-owner: చాణక్య, వరుణ్‌.. దుబాయ్‌లో మా ఫ్లాట్‌లోనే ఉన్నారు

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:22 AM

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసు నిందితులు దుబాయ్‌లోని తన ఫ్లాట్‌లో రెండు నెలలు ఉన్నారని సదరు ఫ్లాట్‌ సహయజమాని...

Flat Co-owner: చాణక్య, వరుణ్‌.. దుబాయ్‌లో మా ఫ్లాట్‌లోనే ఉన్నారు

  • రెండు నెలల పాటు ఆరుగురి మకాం

  • సిట్‌కు లిక్కర్‌ స్కాం నిందితుల

  • ఫుటేజీ, ఫొటోలు ఇచ్చిన ‘ఆకర్ష్‌’ కృష్ణ

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసు నిందితులు దుబాయ్‌లోని తన ఫ్లాట్‌లో రెండు నెలలు ఉన్నారని సదరు ఫ్లాట్‌ సహయజమాని, హైదరాబాద్‌కు చెందిన ఆకర్ష్‌ కృష్ణ తెలిపారు. సీసీ ఫుటేజీతో పాటు వారి ఫొటోలను కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులకు ఇచ్చారు.. కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ తనకు నోటీసు ఇవ్వడంతో కృష్ణ మంగళవారం విజయవాడలోని పోలీసు కమిషనరేట్‌కు విచారణకు వచ్చారు. ‘దుబాయ్‌లోని పారమౌంట్‌ టవర్స్‌లోని రెసిడెన్స్‌లో శ్రవణ్‌రావుతో కలిసి 5801 నంబర్‌ ఫ్లాట్‌ కొనుగోలు చేశాను. అద్దె వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు.. నాకు ఏమీ చెప్పకపోవడంతో నేరుగా అక్కడి వారిని సంప్రదించా.. ఓనర్‌షిప్‌ డాక్యుమెంట్లు అడగడంతో చూపించా.. అప్పటి నుంచి ఆ ఫ్లాట్‌లో జరిగే కార్యకలాపాల వివరాలు చెబుతున్నారు.. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్‌ 27 వరకూ శ్రవణ్‌రావు, బూనేటి చాణక్య, వరుణ్‌ పురుషోత్తం, మరో ముగ్గురు అదే ఫ్లాట్‌లో ఉన్నారు.. నేనెవరికీ అద్దెకు ఇవ్వలేదు.. లిక్కర్‌ స్కాం నిందితులతో నాకెలాంటి సంబంధం లేదు’ అని సిట్‌ అధికారులకు వివరించినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు

For More AP News and Telugu News

Updated Date - Jul 23 , 2025 | 04:23 AM