Challa Nagaraju: ఆదుకోండి
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:16 AM
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన ఇతనికి 2015లో కరెంట్ షాక్ తగలడంతో కాలు, చెయ్యి తొలగించాల్సి వచ్చింది.

Challa Nagaraju: ఈ యువకుడి పేరు చల్లా నాగరాజు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన ఇతనికి 2015లో కరెంట్ షాక్ తగలడంతో కాలు, చెయ్యి తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం తల్లిదండ్రులకు తనే ఆధారం. తనకు తెలుగుదేశం అంటే వీరాభిమానం అని, సీఎంను కలిసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరేందుకు ఇక్కడకొచ్చానని చెబుతున్నాడు నాగరాజు. సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసే అవకాశం కల్పించాలని వేడుకుంటూ రాసి ఉన్న పేపరును చేతిలో పట్టుకుని అసెంబ్లీ వద్ద మంగళవారం ఇలా నిలబడి కనిపించాడు.