Share News

శ్రీవారికి చక్రస్నానం

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:05 AM

స్థానిక కొత్తపేట శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అర్చకులు చక్రస్నానం చేశారు.

శ్రీవారికి చక్రస్నానం
స్వామివారికి చక్రస్నానం చేస్తున్న అర్చకులు

ధర్మవరం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక కొత్తపేట శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అర్చకులు చక్రస్నానం చేశారు. అష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయకమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వివిధ పూజా కార్యక్ర మాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి చక్రస్నానం చేయించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకీలో పట్టణ పురవీధులలో ఉదయం సూర్యప్రభవాహనం, సాయంత్రం అశ్వవాహనంపై ఊరేగించారు. బుధవారంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Updated Date - Feb 12 , 2025 | 12:05 AM