Share News

APSRTC: ఏపీకి 750 ఎలక్ట్రిక్‌ బస్సులు

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:25 AM

ఏపీఎ్‌సఆర్టీసీకి కేంద్రం 750 ఎలక్ట్రిక్‌ బస్సులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 11 నగరాల్లో ఇవి తిరగనున్నాయి.

APSRTC: ఏపీకి 750 ఎలక్ట్రిక్‌ బస్సులు

పీపీపీ పద్ధతిలో ‘పీఎం ఈ-బస్‌ సేవ’

కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ఏపీఎ్‌సఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ‘పీఎం ఈ-బస్‌ సేవ’ కింద మొదటి దశలో 750 ఎలక్ట్రిక్‌ బస్సులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 11 నగరాల్లో తిప్పేందుకు 9 మీటర్లు, 12 మీటర్ల పొడవు ఉండే బస్సులను పంపుతోంది. కేంద్రం పీపీపీ పద్ధతిలో ఈ ఏడాదికి 10 వేల బస్సులను పలు రాష్ట్రాలకు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు 1,050 బస్సులు కేటాయించాలని ఆర్టీసీ గత సెప్టెంబరులో కేంద్రా న్ని కోరింది. అయితే మొదటి విడత టెండర్లలో పూణేకు చెందిన పిన్నాకిల్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌ సంస్థ బస్సుల కాంట్రాక్టు దక్కించుకుంది. ఏపీలో విజయవాడ, గుంటూ రు, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, మంగళగిరి, కడపలో 750 బస్సులు త్వరలో ప్రవేశపెడుతోంది. ఏ డిపోకు బస్సులు కేటాయిస్తున్నారో వాటిల్లో చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోవడానికి ఆర్టీసీ ఎండీ, ఈడీలు మంగళవారం సమావేశమవుతున్నారు.


ఇవి కూడా చదవండి..

TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్

Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు

Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా

Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..

Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..

Nara Lokesh: ‘సారీ గయ్స్‌..హెల్ప్‌ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్‌

LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..

Updated Date - Apr 08 , 2025 | 04:26 AM