Share News

Extortion Case: కేసు నమోదుకు ముందు ఏసీబీ ప్రాథమిక విచారణ చేయలేదు

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:00 AM

స్టోన్‌క్రషర్‌ యజమానిపై కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణతో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐపీఎస్‌ అధికారి పి.జాషువా తరఫు వాదనలు ముగిసాయి. ఏసీబీ అధికారులు బీఎన్‌ఎ్‌సఎస్‌ చట్టం నిబంధనలను అనుసరించలేదని ఆయన న్యాయవాది వాదించారు.

Extortion Case: కేసు నమోదుకు ముందు ఏసీబీ ప్రాథమిక విచారణ చేయలేదు

ఐపీఎస్‌ అధికారి జాషువా న్యాయవాది వాదనలు

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): స్టోన్‌క్రషర్‌ యజమానిని బెదిరించి కోట్లు వసూలు చేశారన్న ఆరోపణతో నమోదైన కేసు కొట్టివేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌లోఐపీఎస్‌ అధికారి పి.జాషువా తరఫు వాదనలు ముగిశాయి. పిటిషనర్‌పై కేసు నమోదు విషయంలో ఏసీబీ అధికారులు బీఎన్‌ఎ్‌సఎస్‌ చట్టం నిబంధనలు అనుసరించలేదని, ఎలాంటి ప్రాఽథమిక విచారణ జరపకుండానే విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా కేసు పెట్టారని ఆయన న్యాయవాది వాదించారు. ఏసీబీ తరఫు వాదనల కోసం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లిఖార్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 05:00 AM