దందాలు సాగవు!
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:40 AM
‘నియోజకవర్గంలో ఎవరి దందాలు సాగవు.. అలాంటివి ఉంటే వెంటనే నాకు చెప్పండి.. మీకు అండగా ఉంటా’ అంటూ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్థానికులకు అభయమిచ్చారు. నియోజకవర్గంలో తులసి దళం దందాలు, అక్రమ వసూళ్లపై ఆంధ్రజ్యోతి ‘గుడివాడలో టీ ట్యాక్స్’ శీర్షికతో ప్రత్యేక కథనం గురువారం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాము కాన్వాయ్, భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి ఓ బుల్లెట్ మీద తానొక్కడే ఓ సామాన్యుడిలా ప్రజల దగ్గరకు వెళ్లారు. వ్యాపారులను కలిసి తన పేరు చెప్పి ఎవరైనా దందాలు సాగిస్తున్నారా అంటూ ఆరా తీశారు.

- అలాంటివి ఉంటే చెప్పండి..
- స్థానికులతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
- బుల్లెట్‌పై వెళ్లి చిరు వ్యాపారులను కలిసిన ఎమ్మెల్యే
- తన పేరు చెప్పి ఎవరైనా దందాలు సాగిస్తున్నారా అంటూ ఆరా
- దందాలు చేస్తే తన దృష్టికి తీసుకురావాలని ఫోన్ నంబర్ ఇచ్చి మరీ అభయం
గుడివాడ, జనవరి 30(ఆంధ్రజ్యోతి):
‘నియోజకవర్గంలో ఎవరి దందాలు సాగవు.. అలాంటివి ఉంటే వెంటనే నాకు చెప్పండి.. మీకు అండగా ఉంటా’ అంటూ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్థానికులకు అభయమిచ్చారు. నియోజకవర్గంలో తులసి దళం దందాలు, అక్రమ వసూళ్లపై ఆంధ్రజ్యోతి ‘గుడివాడలో టీ ట్యాక్స్’ శీర్షికతో ప్రత్యేక కథనం గురువారం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాము కాన్వాయ్, భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి ఓ బుల్లెట్ మీద తానొక్కడే ఓ సామాన్యుడిలా ప్రజల దగ్గరకు వెళ్లారు. వ్యాపారులను కలిసి తన పేరు చెప్పి ఎవరైనా దందాలు సాగిస్తున్నారా అంటూ ఆరా తీశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎవ్వరి దందాలు చెల్లవని, ఏదైనా ఉంటే నేరుగా తన దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయాలని, అండగా ఉంటానని అభయమిచ్చారు. తన ఫోన్ నంబర్‌ను కూడా వారికి తెలియజేశారు. ప్రజల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించాలని కోరారు. పట్టణంలోని రహదారుల వెంబడి చిరువ్యాపారులు, దుకాణదారులు, టీ స్టాల్స్, హోటళ్లకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు బజారులో వినియోగదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు గానీ, రాజకీయ పక్షాలు కానీ ఎక్కడైన అవినీతి, అక్రమాలకు పాల్పడితే తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరారు. గుడివాడ అభివృద్ధికి ఏం కావాలో.. తానేం చేయాలో చెప్పాలని, తాను ఇక్కడే అందుబాటులో ఉన్నానని, నేరుగా తనను కలవచ్చునని వివరించారు.