APCOS Review: ఆప్కోస్ పై మంత్రి వర్గ ఉపసంఘం
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:48 AM
ఆప్కోస్ వ్యవస్థపై సమీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. నారాయణ, లోకేశ్, పయ్యావుల సభ్యులుగా ఉన్న ఈ ఉపసంఘం అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, సమర్థతపై నివేదిక ఇస్తుంది
సభ్యులుగా నారాయణ, లోకేశ్, పయ్యావుల
అమరావతి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్(ఆప్కో్‌స)పై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకునే ప్రస్తుత వ్యవస్థపై సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపసంఘంలో మున్సిపల్ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు. ప్రస్తుత వ్యవస్థ కంటే మరింత జవాబుదారీగా, సమర్థవంతంగా, పారదర్శకంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలు, వారి సంక్షేమాన్ని ఎలా పెంపొందించాలన్న దానిపై నివేదిక ఇవ్వనుంది.