Borugadda Anil Remand Extension: బోరుగడ్డకు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:41 AM
బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడిగించి రాజమండ్రి జైలుకు తరలించారు.వైసీపీ నాయకులపై వ్యాఖ్యల కారణంగా కేసు నమోదై, రిమాండ్ విధించిన న్యాయస్థానం ఉత్తర్వులు.
మళ్లీ రాజమండ్రి జైలుకు తరలింపు
నరసరావుపేట లీగల్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడిగిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎన్.గాయత్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఫిరంగిపురం పోలీస్ ేస్టషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో బోరుగడ్డను మార్చి 24న స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డను పోలీసులు బందోబస్తు మధ్య బుధవారం స్థానిక రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఈ నెల 28 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తిరిగి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.