BJP Lanka Dinkar : కాంగ్రెస్‌కు విశ్వసనీయత లేదు
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:11 AM
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని బీజేపీ అధికార ప్రతినిధి, 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ విమర్శించారు. మన దేశ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం

అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని బీజేపీ అధికార ప్రతినిధి, 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ విమర్శించారు. మన దేశ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం మంచి పాలనను రామరాజ్యంగా పిలుస్తారని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయోఽధ్య రామాలయ నిర్మాణంపై ఆరెస్సెస్ ఛీప్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యల స్ఫూర్తి చాలా ముఖ్యమైందన్నారు. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరో అపజయాన్ని చవిచూసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారన్నారు. తమ వైఫల్యాన్ని పక్కదోవ పట్టించే ఉద్దేశంతో ఆరెస్సెస్, భాగవత్‌లను కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుందని ధ్వజమెత్తారు.