Share News

PM Modi Accused of Vote Theft: ప్రధాని మోదీ ఓట్ల దొంగ

ABN , Publish Date - Aug 14 , 2025 | 04:04 AM

ప్రధాని నరేంద్ర మోదీ ఓట్ల దొంగ అని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి ../

PM Modi Accused of Vote Theft: ప్రధాని మోదీ ఓట్ల దొంగ

ఎన్నికల సంఘం ప్రధానికి తొత్తుగా మారింది.. ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ రాసిచ్చిన స్ర్కిప్టునే ఈసీ చదువుతోంది

  • దొంగ ఓట్లతో బీజేపీ 70 స్థానాలను గెలుచుకుంది

  • మూడోసారి అధికారంలోకి రావడానికి అదే కారణం

  • మారుమూల లోక్‌సభ నియోజకవర్గాలే వారి లక్ష్యం

  • 30ఏళ్లుగా దొంగ ఓట్లను పెంచుకుంటూ పోతోంది

  • దేశ ప్రజల కోసం పోరాడుతున్న రాహుల్‌ గాంధీకిఏపీ, తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలవాలి

  • చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ మోదీకి దత్తపుత్రులు

  • మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లీడర్‌ కాదు.. రీడర్‌

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి

అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ ఓట్ల దొంగ అని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లే కారణమని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు. ఈ ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు దేశ ప్రజలంతా మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ మూడు దశాబ్దాలుగా మారుమూల ప్రాంతాల్లోని లోక్‌సభ నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని దొంగ ఓట్లను పెంచుకుంటూ పోతోందని ఆరోపించారు. అలా దేశవ్యాప్తంగా 70వరకు లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుందని పేర్కొన్నారు. ఈ ఓట్ల చోరీలో ఏబీవీపీ, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌, ఆర్‌ఎ్‌సఎస్‌, సంఘ్‌ పరివార్‌ భాగస్వామ్యం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ రాసిచ్చిన స్ర్కిప్టునే ఎన్నికల సంఘం చదువుతోందని విమర్శించారు. బీజేపీ ప్రముఖ్‌ రాసిచ్చిన స్ర్కిప్ట్‌నే ఇటీవల ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చదివారని.. ఆయన లీడర్‌ కాదని రీడర్‌ అని ఎద్దేవా చేశారు.

ఎన్నికల సంఘం సమాధానం చెప్పడం లేదేం?

ఓట్ల చోరీపై రాహుల్‌గాంధీ ఆధారాలతో సహా లేవనెత్తిన సందేహాలపై కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా ఎందుకు స్పందించడం లేదని జగ్గారెడ్డి నిలదీశారు. ప్రధాని మోదీ, ఆర్‌ఎ్‌సఎస్‌ గొంతునే ఈసీ వినిపిస్తోందని ఆరోపించారు. ప్రధాని కావాలన్న కాంక్షతో రాహుల్‌ పోరాటం చేయడం లేదని, దేశ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని చెప్పారు. అసలు నెహ్రూ నుంచి రాజీవ్‌గాంధీ దాకా ప్రధాని పదవి వారి ఇంట్లోనే పుట్టిందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. దొంగ ఓట్ల వ్యవహారాన్ని రాహుల్‌ సాక్ష్యాధారాలతో బయటపెట్టారని, కాంగ్రెస్‌ పార్టీకి దమ్ముందని చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, వైఎస్‌ జగన్‌లలో ఎవరు అధికారంలోకి వచ్చినా అది బీజేపీ ఖాతాలోకే వెళ్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి చంద్రబాబు, జగన్‌ దత్తపుత్రులని.. బయటికి ఎంత కొట్టుకున్నా చివరికి మోదీ వద్దకు వెళ్లి ఉపశమనం పొందుతారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ పార్టీ బలాన్ని పెంచుకుని ప్రత్యామ్నాయశక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 04:04 AM