Share News

P. V. N. Madhav: కూటమి నాయకులతో కలసి పనిచేస్తా

ABN , Publish Date - Jul 04 , 2025 | 03:36 AM

అధిష్ఠానం నన్ను గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించింది. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

P. V. N. Madhav: కూటమి నాయకులతో కలసి పనిచేస్తా

  • ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రాభివృద్ధికి కృషి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌

విశాఖపట్నం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘అధిష్ఠానం నన్ను గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించింది. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. అధ్యక్షునిగా నియమితులయ్యాక గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్న ఆయనకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, సెయిల్‌ డైరెక్టర్‌ కాశీ విశ్వనాథరాజు, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు పరశురామరాజు, బీజేపీ కార్యకర్తలు విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాధవ్‌ మాట్లాడుతూ... ‘కూటమి పార్టీల నాయకులతో కలసి పనిచేస్తా. బీజేపీకార్యకర్తలకు సముచిత స్థానం లభించేలా ప్రయత్నిస్తా’ అని అన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 03:37 AM