Bird Flu: బాబోయ్ చికెన్ వద్దు!
ABN , Publish Date - Feb 13 , 2025 | 03:59 AM
ఫలితంగా చికెన్ ధరలు పతనమయ్యాయి. వారం రోజులుగా కేజీ చికెన్ ధర 220 నుంచి 240 రూపాయలు ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పౌలీ్ట్రల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో జనంలో భయం నెలకొంది.

బర్డ్ ఫ్లూతో తగ్గిన కోడి మాంసం ధరలు
కొనుగోలుకు వెనుకంజ వేస్తున్న జనం
పశ్చిమలో పలుచోట్ల దుకాణాల మూసివేత
ఇతర ప్రాంతాలపైనా ప్రభావం
పతనమైన గుడ్డు, ఫారం కోడి ధరలు
చికెన్, గుడ్లు బాగా ఉడికించి తినొచ్చు
పరిశుభ్రత పాటించాలి: పశుసంవర్థక శాఖ
భీమవరం/తణుకు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం చికెన్ వినియోగదారులు, రైతులు, వ్యాపారులపై పడింది. చికెన్ పేరెత్తితేనే జనం బెంబేలెత్తుతున్నారు. ఫలితంగా చికెన్ ధరలు పతనమయ్యాయి. వారం రోజులుగా కేజీ చికెన్ ధర 220 నుంచి 240 రూపాయలు ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పౌలీ్ట్రల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో జనంలో భయం నెలకొంది. ఫలితంగా కేజీకి 40 రూపాయల వరకు తగ్గించి అమ్ముతున్నారు. బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లో చికెన్, గుడ్లు తినవద్దని అధికారులు ప్రచారం చేయడంతో దీని ప్రభావం ఇతర ప్రాంతాలపైనా పడింది. చాలా పట్టణాలు, గ్రామాల్లో అమ్మకాలు జరగడం లేదు. గుడ్లు, చికెన్ విక్రయాలు ఆపేయాలని యజమానులకు అధికారులు నోటీసులు పంపించడంతో వారు షాపులకు తాళాలు వేస్తున్నారు. పూర్తిగా వ్యాపారాలు నిలిపివేయడంతో షాపుల్లో పనిచేసే వారికి ఉపాధి లేకుండా పోయింది. వ్యాపారాలు సాగనపుడు రోజువారీ ఖర్చులన్నీ భారమవుతాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఈ ప్రభావం కనీసం రెండు నెలలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పౌలీ్ట్రలపై భారం..
కోళ్లు మృత్యువాత పడిన తర్వాత.. వ్యాక్సిన్, శానిటేషన్ కోసం ప్రతి పౌల్ర్టీలోనూ రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే గుడ్లు పెట్టే కోళ్లు 1.15 కోట్ల వరకు ఉండేవి. వ్యాధుల వల్ల దాదాపు 40 లక్షల వరకు మృత్యువాత పడ్డాయి. పైగా ఇప్పుడు గుడ్డు ధరలు తగ్గిపోవడంతో పౌలీ్ట్రలు మూసేయాలని రైతులు నిర్ణయించారు. గుడ్లు పెట్టే ఫారం కోడిని రూ.10లకే విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ 2.50 కోట్ల మేర గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ప్రస్తుతం 1.60 కోట్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నట్టు రైతులు చెబుతున్నారు. అయినప్పటికీ ధరలు పతనమయ్యాయి. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు పరిధిలో పది కిలోమీటర్ల మేర ప్రకటించిన అలెర్ట్ జోన్‌లో దాదాపు 80 లక్షల వరకు కోళ్లు ఉన్నాయి. వాటి అమ్మకాలనూ నిలిపివేశారు. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం, అంగన్ వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరాను నిలిపివేశారు. ఉన్నట్టుండి షాపులు మూసేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని తణుకులో చికెన్ వ్యాపారి చిలుకూరి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
బర్డ్‌ఫ్లూపై ఆందోళన వద్దు: మంత్రి అచ్చెన్న
అమరావతి: బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవపరం లేదని, బాగా ఉడికించిన కోడిగుడ్లు, చికెన్ తినొచ్చని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. బుధవారం రాత్రి ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరులో 2.5లక్షలు, కానూరులో 65వేలు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో 7వేల కోళ్లు చనిపోయినట్లు సమాచారం వచ్చింది. వెంటనే ఆ కోళ్ల నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ వైరస్ బయటపడింది. దీంతో గుడ్లు, చికెన్ తినకూడదన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ వ్యాధి పూర్తిగా నాశనమౌతుంది. కోడి మాంసం, గుడ్లు బాగా ఉడికించి, తింటే ఇబ్బంది లేదు. 70 డిగ్రీలపైన వేడి ఉంటే.. వ్యాధి ప్రభావం ఉండదు’ అని అచ్చెన్న చెప్పారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తమైన పశుసంవర్థక శాఖ రాష్ట్రవ్యాప్తంగా 721 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయిన ప్రాంతంలో కిలో మీటర్ పరిధిలో అలెర్ట్ జోన్‌గా ప్రకటించారు.
చికెన్, గుడ్లు ఉడికించి తినొచ్చు: ప్రభుత్వం
అలెర్ట్ జోన్ మినహా మిగతా ప్రాంతాల్లో బాగా ఉడకబెట్టిన కోడి గుడ్లు, చికెన్ నిర్భయంగా తినొచ్చని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు ఓ ప్రకటనలో చెప్పారు. కోళ్ల పెంపకందారులు, ప్రజలకు ఆయన కొన్ని సూచనలు చేశారు. ‘కోళ్ల షెడ్ల ప్రవేశ మార్గంలో ఫుట్‌బాత్‌లు ఏర్పాటు చేసుకోవాలి. దీనికి 0.01శాతం పొటాషియం పర్మాంగనేట్ వాడాలి. కోళ్ల షెడ్ల పరిసరాల్లో 2శాతం సోడియం హైపోక్లోరైట్ లేదా బ్లీచింగ్ పౌడర్ లేదా సున్నం చల్లాలి. పౌల్ర్టీల్లో పనిచేసే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఏదైనా కోడి చనిపోతే పూడ్చిపెట్టాలి. ఇతర జీవ భద్రతా చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.
బాదంపూడిలో బర్డ్‌ఫ్లూ..
ఉంగుటూరు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని శ్రీ వేంకట మణికంఠ పౌలీ్ట్ర ఫారంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో పది కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. బాదంపూ డి పౌలీ్ట్ర నుంచి కిలోమీటరు పరిధిని రెడ్ జోన్ గాను, పది కి.మీ. పరిధిని సర్వేలెన్స్ జోన్‌గా ప్రకటించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News