‘ఎన్టీఆర్‌కు భారతరత్న’ దీక్ష విరమణ
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:22 AM
దివంగత ఎన్టీ రామా రావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌తో పట్టణానికి చెందిన పట్టుచీరల పాలిష్ కార్మికుడు బీఎల్ నరసింహులు 41 రోజులుగా చేస్తున్న సంకల్ప మండల దీక్షను గురువారం విరమించారు

ధర్మవరంరూరల్, జనవరి 30(ఆంధ్రజ్యోతి): దివంగత ఎన్టీ రామా రావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌తో పట్టణానికి చెందిన పట్టుచీరల పాలిష్ కార్మికుడు బీఎల్ నరసింహులు 41 రోజులుగా చేస్తున్న సంకల్ప మండల దీక్షను గురువారం విరమించారు. జడ్పీ మాజీ చైర్మన, టీడీపీ సీనియర్ నాయకుడు చిగిచెర్ల ఓబిరెడ్డి, టీడీపీ నాయకులు నరసింహులు దీక్షకు సంఘీభావం తెలిపి.. కొబ్బరినీళ్లు, నిమ్మరసం తాపించి దీక్షను విరమింపజేశారు. అనంతరం నరసిం హులను పలువురు పూలమాలలతో సత్కారించారు. దీక్ష శిబిరం నుంచి ర్యాలీగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మేకల రామాంజినేయులు, ధర్మవరం చెరువు సాగునీటి సంఘం చైర్మన రేనాటి శ్రీనివాసులు, బట్టా ఆశ్వర్థనాయుడు, తుమ్మల నరసింహరెడ్డి, భాస్కర్‌రెడ్డి, తిప్పేపల్లి వెంకటరాముడు, నరసింహులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.