Share News

బీడీ కార్మికులను ఆదుకోవాలి

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:10 AM

బీడీ కార్మికులకు ప్రత్యే క సంక్షేమ పథకాలు అమలు చేసి.. ఆదుకోవాలని బీడీ అండ్‌ సిగార్స్‌ వర్క్‌ర్సు యూనియన రాష్ట్ర కన్వీనర్‌ ఓబులు డిమాండ్‌ చేశారు

బీడీ కార్మికులను ఆదుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఓబులు

కదిరిఅర్బన, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి) : బీడీ కార్మికులకు ప్రత్యే క సంక్షేమ పథకాలు అమలు చేసి.. ఆదుకోవాలని బీడీ అండ్‌ సిగార్స్‌ వర్క్‌ర్సు యూనియన రాష్ట్ర కన్వీనర్‌ ఓబులు డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని ఎన్జీవో హోంలో నిర్వహించిన ఆ యూనియన రాష్ట్ర సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీడీ కార్మికులకు ప్రభుత్వం నేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఈఎ్‌సఐ ఆసుపత్రి ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించాలని, బీడీ చట్టం 1966, కార్మికుల సంక్షేమ చట్టం 1976ను పునరుద్ధరించాలని కోరారు. బీడీ కార్మికుల కూలి పెంచాలని, బీడీ పరిశ్రమపై విధించే జీఎ్‌సటీ నుంచి కార్మికులకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన రాష్ట్ర కో-కన్వీనర్‌ ఇక్బాల్‌హుస్సేన, నాయకులు ఉమాగౌడ్‌, మున్నీ, చంద్రకళ, అసినతాజ్‌, సిఐటియు వెంకటేష్‌, జిఎల్‌ నరసింహులు, జగన్మోహన, ముస్తాక్‌, రామమోహన పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 12:10 AM