Bear Attack: అల్లూరి ఏజెన్సీలో భయానక ఘటన: నిద్రిస్తున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి
ABN , Publish Date - Dec 07 , 2025 | 10:35 AM
అరకులోయ మండలం ఇరగాయి పంచాయితీలో భయానక సంఘటన చోటుచేసుకుంది. ఉరుములు గ్రామానికి చెందిన ఓ గిరిజనుడిపై ఓ ఎలుగు బంటి దాడి చేసింది. తల, చేతులపై తీవ్ర గాయాలు చేసింది.
అల్లూరి ఏజెన్సీలో భయానక ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్రంగా గాయపరిచింది. అరకులోయ మండలం ఇరగాయి పంచాయితీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉరుములు గ్రామానికి చెందిన జన్ని అప్పారావు అనే గిరిజనుడు గ్రామ సమీపంలోని కొండపై పంట వేశాడు. శనివారం రాత్రి పంటకు కాపలాగా పడుకున్నాడు. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఓ ఎలుగుబంటి పంట పొలం దగ్గరకు వచ్చింది. నిద్రిస్తున్న అప్పారావుపై విచక్షణా రహితంగా దాడి చేసింది.
తల, చేతులపై బలంగా చీరింది. దీంతో అప్పారావు గట్టిగా కేకలు వేస్తూ అక్కడినుంచి కొండ కిందకు పరుగులు తీశారు. అతడ్ని గుర్తించిన స్థానికులు వెంటనే 108 సాయంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పారావు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
పెరిగిన ఎలుగుబంటి దాడులు..
తెలుగు రాష్ట్రాల్లో ఎలుగుబంట్ల దాడులు బాగా పెరిగిపోయాయి. కొద్దిరోజుల క్రితం శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లిన ఓ యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. హటేకేశ్వరం గిరిజనగూడేనికి చెందిన చిన్నదేవయ్య అనే యువకుడు శ్రీశైలం దర్శనానికి వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై ఎలుగుబంటి దాడి చేసింది. స్థానికులు అతడ్ని సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి
విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన.. సాయంత్రంలోపు 1500 విమానాలు..
మీ హద్దుల్లో మీరుంటే మంచిది.. గంభీర్ అసహనం